Keerthi Suresh : కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. పెళ్లి అయిన తర్వాత కూడా వరుసగా మూవీలు చేస్తూనే ఉంది ఈ బ్యూటీ. తాజాగా ఆమె లవ్ స్టోరీని బయట పెట్టేసింది. సుహాస్, కీర్తి సురేష్ కలిసి నటిస్తున్న మూవీ ఉప్పుకప్పురంబు. జులై 4న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్లు చేస్తూనే ఉన్నారు. తాజాగా యాంకర్ సుమతో చేసిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను పంచుకుంది. మీ భర్తతో ఎన్నేళ్లుగా లవ్…
నటి కీర్తి సురేష్ తన భర్త ఆంటోనీ తటిల్‌తో 15 ఏళ్ల ప్రేమ కథను వెల్లడించింది. ఆర్కుట్‌లో మొదలైన ప్రేమకథ పెళ్లి వరకు సాగింది అని వెల్లడింది. ఈ బంధం గురించి సినీ పరిశ్రమలోని కొద్దిమంది సన్నిహితులకు మాత్రమే తెలుసునని ఆమె అన్నారు. ఇటీవల గలాటా ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, కీర్తి 15 సంవత్సరాల పాటు డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకున్నానని అన్నారు. ఆర్కుట్‌లో తమ ప్రేమ కథ ప్రారంభమైందని వెల్లడించింది. తాను ఆంటోనీతో డేటింగ్ చేస్తున్న…
రెండు రోజుల క్రితం స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ తనకు కాబోయేవాడిని పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈరోజు తాను వచ్చే నెలలోనే వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నట్లు తెలిపారు. తిరుమల సన్నిధిలో కీర్తి ఈ విషయాన్ని వెల్లడించారు. కీర్తి తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి.. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కీర్తి…
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. వచ్చే డిసెంబర్‌లో పెళ్లి అని, కీర్తికి కాబోయే వాడు ఇతడే అంటూ కొన్ని ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి. చివరకు ఆ రూమర్లే నిజమయ్యాయి. కీర్తి తనకు కాబోయే వాడిని పరిచయం చేశారు. ఇద్దరూ కలిసున్న ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. తన రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించారు. దీపావళి వేడుకల్లో భాగంగా ఆంటోనీ తట్టిళ్‌తో…
నటి కీర్తి సురేష్ తన చిరకాల ప్రియుడు ఆంథోనీ తటిల్‌తో డిసెంబర్ 11 మరియు 12 తేదీల్లో గోవాలో వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. కీర్తి బాయ్‌ఫ్రెండ్, దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త ఆంథోనీ తటిల్‌ను గోవాలో రహస్య వేడుకలో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కీర్తి-ఆంథోనీల వివాహం డిసెంబర్ 11 మరియు 12 తేదీల్లో జరగనుంది, ఇందులో కీర్తి మరియు ఆంథోనీల కుటుంబం మరియు స్నేహితులు మాత్రమే హాజరు కానున్నారు. కీర్తి పెళ్లి వార్త బయటకు వచ్చినప్పటి నుంచి…