Keerthy Suresh: 15 ఏళ్ల ప్రేమ.. కాబోయే వాడిని పరిచయం చేసిన కీర్తి సురేశ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి అంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. వచ్చే డిసెంబర్‌లో పెళ్లి అని, కీర్తికి కాబోయే వాడు ఇతడే అంటూ కొన్ని ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి. చివరకు ఆ రూమర్లే నిజమయ్యాయి. కీర్తి తనకు కాబోయే వాడిని పరిచయం చేశారు. ఇద్దరూ కలిసున్న ఫొటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. తన రిలేషన్‌షిప్‌ను అధికారికంగా ప్రకటించారు.
దీపావళి వేడుకల్లో భాగంగా ఆంటోనీ తట్టిళ్‌తో కలిసి దిగిన ఫొటోని కీర్తి సురేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ’15 ఏళ్ల స్నేహబంధం జీవితాంతం కొనసాగనుంది. ఎప్పటికీ ఆంటోనీ-కీర్తి ఒక్కటే’ అని రాసుకొచ్చారు. ఇద్దరూ కలిసున్న ఫొటోని పోస్ట్ చేశారు గానీ.. ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. ఏదేమైనా ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది. ఈ పోస్టుపై కీర్తి ఫాన్స్, పలువురు సెలబ్రిటీలు స్పందించి కంగ్రాట్స్ చెబుతున్నారు. కీర్తికి హీరోయిన్ రాశీ ఖన్నా కంగ్రాట్స్ చెప్పారు. ‘మేము ఇప్పుడే తెలుసుకున్నాం. కంగ్రాట్స్ లవ్’ అని రాశీ ఖన్నా కామెంట్ పెట్టారు.
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
Also Read: Naga Chaitanya-Sobhita: నాగచైతన్య, శోభితా పెళ్లి.. అవన్నీ రూమర్స్!
మలయాళ నిర్మాత సురేశ్, నటి మేనకల కూతురై కీర్తి సురేశ్. కీర్తి బాలనటిగా చేశారు. మలయాళీ సినిమా గీతాంజలితో నటిగా ఎంట్రీ ఇచ్చారు. నేను శైలజతో తెలుగు తెరకు పరిచయమయ్యారు. మహానటి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. తెలుగు, తమిళ, మలయాళం, హిందీలో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రివాల్వర్ రీటా, బేబీ జాన్ చిత్రాలు చేస్తున్నారు. మరోవైపు ఇంజినీరింగ్ చదివిన ఆంటోనీ కొంతకాలం విదేశాల్లో ఉద్యోగం చేశాడట. ప్రస్తుతం కేరళలో పలు వ్యాపారాలు చేసుకుంటున్నాడని టాక్.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?