Keerthy Suresh Marriage: డిసెంబర్‌లోనే నా పెళ్లి: కీర్తి సురేశ్
- శ్రీవారిని దర్శించుకున్న కీర్తి సురేశ్
- వచ్చే నెలలోనే కీర్తి పెళ్లి
- గోవాలో వెడ్డింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు రోజుల క్రితం స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ తనకు కాబోయేవాడిని పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈరోజు తాను వచ్చే నెలలోనే వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నట్లు తెలిపారు. తిరుమల సన్నిధిలో కీర్తి ఈ విషయాన్ని వెల్లడించారు. కీర్తి తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి.. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కీర్తి సురేశ్ మీడియాతో మాట్లాడుతూ… ‘వచ్చే నెలలోనే నేను పెళ్లి చేసుకోబోతున్నా. గోవాలో వెడ్డింగ్ జరుగుతుంది. నేను చేసిన హిందీ సినిమా బేబీ జాన్ కూడా వచ్చే నెలలో విడుదల కానుంది. అందుకే స్వామివారి దర్శనం కోసం తిరుమల వచ్చాను’ అని తెలిపారు. ఆంటోని తట్టిళ్‌తో తాను 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నట్లు ఇటీవల కీర్తి చెప్పారు. దీపావళి వేడుకల్లో భాగంగా ఆంటోనీతో కలిసి దిగిన ఫొటోని కీర్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇక డిసెంబరు 11, 12 తేదీల్లో గోవాలోని ఓ రిసార్ట్‌లో పెళ్లి వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
- Women's Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
- Astrology: సెప్టెంబర్ 14 సోమవారం దినఫలాలు.. వినాయక చవితి రోజు ఈ రాశుల వారికి అన్నీ శుభాలే..!
Also Read: Pushpa 2: చిత్తూరులో కాదు.. హైదరాబాద్‌లోనే ‘పుష్ప’ ప్రీ-రిలీజ్ ఈవెంట్?
కీర్తి సురేశ్ తన పెళ్లికి సంబందించిన పనులను ప్రారంభించారట. కీలక పనులకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక మలయాళ నిర్మాత సురేశ్, నటి మేనకల కూతురై కీర్తి. బాలనటిగా చేసిన ఆమె.. మలయాళీ సినిమా గీతాంజలితో నటిగా ఎంట్రీ ఇచ్చారు. నేను శైలజతో తెలుగు తెరకు పరిచయమై.. మహానటి సినిమాతో స్టార్ అయ్యారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళం, హిందీలో సినిమాలు చేస్తున్నారు. రివాల్వర్ రీటా, బేబీ జాన్ చిత్రాల షూట్‌లతో బిజీగా ఉన్నారు.
తాజావార్తలు
-
US China AI race: AIని గెలిచిన దేశానిదే ప్రపంచ ఆధిపత్యం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Ranabaali: ప్రెగ్నెంట్‌గా రష్మిక.. ‘జయమ్మ’కు గుడ్‌బై చెప్పేసిన నేషనల్ క్రష్, సెట్స్‌లో విజయ్ స్పెషల్ హగ్!
-
Ganesh Chaturthi 2026: బొజ్జ గణపయ్య ప్రతిష్ఠకు శుభ ముహూర్తం.. పూజా సామగ్రి.. పూజా విధానం ఇదే!
-
Women’s Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
-
Women’s Asia Cup 2026: ష్రీ చరణి బౌలింగ్ దెబ్బకు శ్రీలంక విలవిల.. మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!