Sheikh Hasina: మాల్దీవుల దారిలోనే ‘‘ఇండియా ఔట్’’ అనే నినాదంతో బంగ్లాదేశ్ ప్రతిపక్ష పార్టీ బీఎన్‌పీ ఉద్యమాన్ని లేవనెత్తింది. భారతదేశానికి మిత్రురాలిగా ఉన్న ఆ దేశ ప్రధాని షేక్ హసీనాపై ద్వేషంతో అక్కడ మతఛాందసవాద బీఎన్‌పీ ఈ ప్రచారాన్ని ప్రారంభించింది.
Ram Mandir: జనవరి 22న జరిగే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి దేశం సిద్ధమవుతోంది. ఇప్పటికే అయోధ్యతో పాటు దేశవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం కోట్లాది మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్నారు. గురువారం రామ్ లల్లా(బాల రాముడి) విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతుండగా.. దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు సాధువులతో సహా మొత్తం 7000 మంది అతిథులు హాజరవుతున్నారు.