అన్నమయ్య జిల్లా సరిహద్దుల్లో ఘోర ప్రమాదం జరిగింది. కారు కంటైనర్ లారీని ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గువ్వల చెరువు ఘాట్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాగా.. కారు కడప నుండి రాయచోటికి వెళ్తున్న సమయంలో కంటైనర్ ను ఢీకొట్టింది.
అన్నమయ్య జిల్లా రామపురం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి మంత్రి మాట్లాడుతూ.. రాయచోటి-కడప మార్గమధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందడం బాధాకరం, దురదృష్టకరం అని అన్నారు. మరణాలు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు వల్లే సంభవిస్తున్నాయి.. దయచేసి ఎవరు మద్యం తాగి వాహనాలు నడపరాదని తెలిపారు.
ఏపీలో ఓ అత్యాచార ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అన్నమయ్య జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మహిళపై ఓ వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వీరబల్లి మండలం ఓదివీడు గ్రామం దూళ్ళ హరిజనవాడలో జరిగింది.
మన రోజువారీ కూరల్లో వాడే టమాట ప్రతి కుటుంబానికి పట్టపగలే చుక్కలు చూపిస్తుంది. గత కొన్ని రోజులుగా టమాటా ధర పైపైకి దూసుకెళ్తుంది. అయితే, ఇవాళ (శనివారం) టమాట ధర ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మార్కెట్‌లో నాణ్యమైన టమాట ధర కిలో 196 రూపాయలకు చేరుకుని ఆల్ టైం రికార్డు నెలకొల్పింది.