అన్నమయ్య జిల్లా చిట్వేలి మండల కేంద్రంలో 78 మందితో నూతనంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రారంభమైంది. ఇటీవల నిర్వహించిన మొదటి సంవత్సరం పరీక్షలు అందరూ రాశాడు. తాజాగా ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల కాగా.. ఈ 78 మంది విద్యార్థుల్లో ఒక్కరు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. పాసైన విద్యార్థిని ఆనందల మల్లికకు 294 మార్కులు వచ్చాయి. మిగతా 77 మంది విద్యార్థిని విద్యార్థులు ఫెయిలయ్యారు. జూనియర్ కాలేజీ లో ప్రిన్సిపాల్, లెక్చలర్లు లేకపోవడంతో ఉత్తీర్ణశాతం పూర్తిగా దెబ్బతింది.
READ MORE: Arjun Son Of Vyjayanthi : అర్జున్ s/o వైజయంతి ట్రైలర్ రివ్యూ.. ఎలా ఉందంటే..?
కాగా.. నేడు ఏపీ ఇంటర్ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 70 శాతం ఉత్తీర్ణత సాధించగా.. రెండో ఏడాదిలో 83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. గత పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం ఈ ఏడాది నమోదైందని పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ కాలేజీల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఇంటర్‌లో మంచి ఫలితాలు వచ్చేందుకు అధ్యాపకులు, సిబ్బంది కృషి చేశారని కొనియాడారు.
READ MORE: Father Suicide: కూతురి ప్రేమ పెళ్లితో తండ్రి ఆత్మహత్య.. “బిడ్డను ఎలా చంపగలను” అంటూ సూసైడ్ లెటర్..