Ganesh Immersion: అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పోకనాటి వీధి వినాయకుడి ఊరేగింపు ప్రారంభమైన కాసేపటికే డీజే సౌండ్ బాక్సుల్లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీకి చెందిన పాటలు వేయడంపై బి. కొత్తకోటలో పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రోజు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు.. రైల్వేకోడూరు మండలంలోని మైసురావారిపల్లెలో గ్రామ సభలో పాల్గొనబోతున్నారు.. ఆ తర్వాత అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో దెబ్బతిన్న పులపత్తూరు గ్రామాన్ని పరిశీలించనున్నారు.. రాజంపేట మండలంలోని పులపత్తూరు గ్రామంలో అన్నమయ్య డ్యాం తెగి వరదలకు దెబ్బతిన్న గ్రామాలను పరిశీలించబోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రేపు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు.. రైల్వేకోడూరు మండలంలోని మైసురావారిపల్లెలో గ్రామ సభలో పాల్గొననున్న ఆయన.. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో దెబ్బతిన్న పులపత్తూరు గ్రామాన్ని పరిశీలించనున్నారు..
కొన్ని నిమిషాల్లో పెళ్లి అయిపోతుందనే సమయానికి పెళ్లి వేదికకు ప్రియురాలి వచ్చి హల్ చల్ చేసింది. దీంతో.. పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. నందలూరుకు చెందిన యువతితో రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ భాషాతో వివాహం జరగాల్సి ఉంది. అయితే.. వరుడు సయ్యద్ భాషాతో తిరుపతికి చెందిన వివాహిత జయతో వివాహేతర సంబంధం ఉంది. కాగా.. తన ప్రియుడికి వేరే అమ్మాయితో వివాహం అవుతుందని తెలుసుకుని పెళ్లి వేదికకు వచ్చింది.
అన్నమయ్య జిల్లా రాయచోటిలో విషాదం చోటు చేసుకుంది.. రాయచోటిలోని కెనరా బ్యాంకుకు పెన్షన్ కోసం వెళ్లి బ్యాంక్ ముందు కుప్పకూలిన వృద్దుడు అక్కడికక్కడే కన్నుమూశాడు.. మృతుడు సుబ్బన్న (80)గా గుర్తించారు. లక్కిరెడ్డిపల్లి మండలం కాకుళారం గ్రామం పిచ్చిగుంటపల్లెకుకు చెందిన ముద్రగడ సుబ్బన్న.. పెన్షన్ కోసం వెళ్లి.. బ్యాంకు వద్ద కుప్పకూలి మృత్యువాత పడ్డారు