రాజస్థాన్‌లోని భివాడి నుంచి తన ఫేస్‌బుక్ ప్రేమికుడి కోసం పాకిస్థాన్‌కు చేరుకున్న అంజు.. మరోసారి వార్తల్లోని హెడ్‌లైన్స్‌లో కొనసాగుతోంది. అంజును పాకిస్థాన్‌కు తీసుకెళ్లేందుకు ప్రేరేపించారని ఆమె భర్త అరవింద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పాకిస్తాన్ జాతీయురాలు సీమా హైదర్ నేపథ్యం, భారతదేశంలోకి ఆమె అక్రమ ప్రవేశంపై విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఒక భారతీయ మహిళ ఇప్పుడు తన ప్రేమికుడిని కలవడానికి సరిహద్దు దాటి వెళ్లింది.