Anil Ravipudi: టాలీవుడ్‌లో కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన దర్శకుడు అనిల్ రావిపూడి. ఎన్టీవీ నిర్వహించిన ప్రత్యేక పాడ్‌కాస్ట్ షోలో పాల్గొని తన సినిమా ప్రయాణం, విజయ రహస్యాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన డైరెక్షన్ గురించి, నటులతో అనుబంధం, భవిష్యత్తు ప్రణాళికల గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. తన సినిమాల్లో హాస్యం ప్రధానంగా ఉన్నప్పటికీ, దాని వెనుక బలమైన భావోద్వేగాలు, అండర్‌కరెంట్ మెసేజ్ ఉంటాయని పేర్కొన్నారు.…