Anil Ravipudi Birthday Special: నవతరం దర్శకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకొని సాగుతున్నారు అనిల్ రావిపూడి. చూడగానే బాగా తెలిసిన కుర్రాడిలా కనిపిస్తారు. అతనిలో అంత విషయం ఉందని ఒహ పట్టానా నమ్మబుద్ధి కాదు. కానీ, అనిల్ రావిపూడి తీసిన వినోదాల విందుల గురించి తెలియగానే ఆశ్చర్యపోవడం మనవంతవుతుంది. ‘పటాస్’లో ఆయన పంచిన పకపకలు, ‘సుప్రీమ్’లో అనిల్ పెట్టిన కితకితలు, ‘రాజా ది గ్రేట్’లో గిలిగింతల చిందులు జనం మరచిపోలేక పోతున్నారు. ఆ తరువాత వచ్చిన…