షేర్ మార్కెట్లో లావాదేవీలు జరుపుతున్నట్లు పేర్కొన్న వడోదరలోని ఒక బోగస్ కంపెనీని గుజరాత్ పోలీసులు ఛేదించి 17 మందిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ‘ఏంజెల్ బ్రోకింగ్ కస్టమర్ కేర్’ అనే మోసపూరిత సంస్థను ఏర్పాటు చేసి, బాధితులను ప్రలోభపెట్టడానికి వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి, లక్షలాది రూపాయలను మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. వడోదరకు చెందిన ఓ కంపెనీలో సీనియర్ అధికారి నుంచి ఈ ముఠా 94.18 లక్షలు వసూలు చేసారు. అరెస్టయిన వారందరినీ గురువారం…