Harish Rao : ఒకటో తేదీ నాడే ఉద్యోగులకు జీతాలు అంటూ గప్పాలు కొట్టిన సీఎం రేవంత్.. ఈనెల 14వ తేదీ వచ్చినా 39,568 మంది అంగన్వాడీ టీచర్లలు, ఆయాలు జీతాలు రాక ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రెస్ నోట్ విడుదల చేశారు. 10 నెలలుగా అంగన్వాడి కేంద్రాలకు అద్దెలు కూడా చెల్లించని దుస్థితి ఉంది ఆయన పేర్కొన్నారు. ఏడాది కాంగ్రెస్ పాలనలో మీరు సాధించిన ఘనత…
సచివాలయంలో అంగన్వాడి టీచర్లు, హెల్పర్లతో మహిళా శిశు సంక్షేమ మంత్రి సీతక్క భేటీ అయ్యారు. అంగన్వాడి సిబ్బందికి ఇచ్చే చీరల ఎంపిక కోసం అంగన్వాడి టీచర్లు, హెల్పర్ల అభిప్రాయాలను మంత్రి సీతక్క తెలుసుకుంటున్నారు. గతంతో పోలిస్తే నాణ్యమైన చీరలు ఇవ్వాలని మంత్రికి అంగన్వాడి టీచర్లు విజ్ఞప్తి చేశారు.
Telangana Govt: అంగన్‌వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. వీరికి ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించారు. త్వరలో ప్రకటించనున్న పీఆర్సీలో అంగన్‌వాడీలను కూడా చేర్చాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 3,989 మినీ అంగన్‌వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్‌వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.
కొత్తగా చేస్తున్న ప్రతిపాదనల వల్ల ఒక్క స్కూలు కూడా మూతపడే పరిస్థితి రాకూడదని అధికారులకు స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి… మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ అంగన్‌వాడీ ఉపాధ్యాయుల కోసం రూపొందించిన స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకం, సీడీలను ఆవిష్కరించిన సీఎం.. అంగన్‌వాడీ అభివృద్ధి కమిటీ శిక్షణ కోసం రూపొందించిన కరదీపిక నమూనాను పరిశీలించారు.. విద్యార్థులు-టీచర్ల నిష్పత్తి సర్దుబాటుకు పలు ప్రతిపాదనలు చేశారు.. పిల్లలు తక్కువుగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో అంగన్‌వాడీ పిల్లలను కలిపే విధంగా…