కొత్త ప్రతిపాదనలతో ఒక్క స్కూలు కూడా మూతపడొద్దు-సీఎం జగన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొత్తగా చేస్తున్న ప్రతిపాదనల వల్ల ఒక్క స్కూలు కూడా మూతపడే పరిస్థితి రాకూడదని అధికారులకు స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి… మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ అంగన్‌వాడీ ఉపాధ్యాయుల కోసం రూపొందించిన స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకం, సీడీలను ఆవిష్కరించిన సీఎం.. అంగన్‌వాడీ అభివృద్ధి కమిటీ శిక్షణ కోసం రూపొందించిన కరదీపిక నమూనాను పరిశీలించారు.. విద్యార్థులు-టీచర్ల నిష్పత్తి సర్దుబాటుకు పలు ప్రతిపాదనలు చేశారు.. పిల్లలు తక్కువుగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో అంగన్‌వాడీ పిల్లలను కలిపే విధంగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.. అవసరమైన చోట్ల మూడు నుంచి ఐదో తరగతి వరకూ కూడా హైస్కూల్ పరిధికి తీసుకురావాలని ప్రతిపాదనలు చేశారు.. అవసరమైన చోట అప్పర్‌ప్రైమరీ స్కూళ్లను హైస్కూళ్లగా మార్చే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేస్తున్నారు.. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
మనిషిని కష్టపెట్టి, బాధపెట్టి.. ఏం సాధించలేం అన్నారు సీఎం వైఎస్ జగన్… అసహనం ఎప్పుడూ కూడా బయటకు రానివ్వకూడదన్న ఆయన.. మనం తీసుకుంటున్న విప్లవాత్మక మార్పుల్లో టీచర్ల పాత్ర కీలకంగా ఉంటుందన్నారు.. స్కూళ్ల నిర్వహణలో జాతీయ ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేసిన ఆయన.. పిల్లలకు 2 కిలోమీటర్ల దూరం లోపలే బడి ఉండాలన్నారు.. అంగన్‌వాడీ టీచర్లకు మంచి శిక్షణ ఇవ్వాలని సూచించిన ఏపీ సీఎం.. పెద్దవాళ్ల పిల్లల మాదిరిగా పేదవాడి పిల్లలు కూడా ఇంగ్లీషులో మంచి విద్యను అందుకోవాలని తెలిపారు.
Also Read
- YS Jagan: వైఎస్ జగన్‌కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
- ED Raids: తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఈడీ సోదాలు.. ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు!
- Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
తాజావార్తలు
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్‌కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్‌తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!
-
YS Jagan: వైఎస్ జగన్‌కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం.. బేగంపేటను ముంచెత్తిన ఫ్లెక్సీల హంగామా..
-
US Open 2026: యూఎస్ ఓపెన్ 2026లో చరిత్రలోనే భారీ ప్రైజ్‌పూల్.. సింగిల్స్ విజేతకు రూ.52.65 కోట్లు
-
SRH Player: 51 బంతుల్లో 111 పరుగులు.. ఓ రేంజ్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ మాజీ ఆటగాడు..
ట్రెండింగ్
-
గూగుల్ బంపర్ ఆఫర్.. వారందరికీ ఏడాది పాటు Google AI Plus ఉచితం.!
-
6.7 అంగుళాల AMOLED 2x డిస్ప్లే, 50MP కెమెరాతో ఆగస్టు 27న రానున్న Samsung Galaxy S26 FE 5G..!
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!