CM YS Jagan: ఈ నెల 15న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లాలోని మాచర్లలో పర్యటించనున్నారు. వరికపూడిసెల ప్రాజెక్టుకు సీఎం జగన్ శంకుస్ధాపన చేయనున్నారు. ఉదయం 9.45 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరనున్నారు. మాచర్ల చెన్నకేశవ కాలనీ సభాస్ధలి వద్ద వరికపూడిసెల ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. మాచర్ల నియోజకవర్గంలో వరికపూడిసెల ప్రాజెక్టు పనులకు ఈ పర్యటన లో శ్రీకారం చుట్టనున్నారు. ఈ తరుణంలో మాచర్లలోని రాయవరం జంక్షన్ లో భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. సభలో ప్రసంగించిన అనంతరం మధ్యాహ్నం తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.
Also Read: CM KCR: నేను ఆమరణ నిరహర దీక్ష చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది..
ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఆంధ్రప్రదేశ్ రైతులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. కరువు మండలాల ప్రకటనకు, పంటల బీమాకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నూట మూడు మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడంపై రైతులు, ప్రతిపక్షాల నుంచి నిరసన వ్యక్తమైన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై సీఎం జగన్ తాజాగా స్పందించారు. అర్హులైన రైతులందరికీ పంటల బీమా వర్తింప చేస్తామని హామీ ఇచ్చారు.