తిరుమల తిరుపతి దేవస్థానం అధికారపార్టీ నేతల అవినీతికి అడ్డాగా మారిందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి ఆరోపించారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్ అయ్యాక దేవస్థానం డబ్బుల్ని తన కొడుకు అభినవ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
గృహ నిర్మాణ శాఖపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హౌసింగ్ కింద ఇళ్ల నిర్మాణం వేగాన్ని పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు.
చంద్రబాబు మెడికల్ బెయిల్ మీద మరింతకాలం ఉండడానికి వీలుగా మెడికల్ రిపోర్టు ఇచ్చినట్టుందని వైసీపీ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చర్మ వ్యాధులను ప్రాణాంతక వ్యాధులన్నట్టు మెసేజ్ వచ్చేలా చేశాడన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఈ నెల 17న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లా నూజివీడులో పర్యటించనున్నారు. 2003కు మందు అసైన్‌మెంట్ భూములకు హక్కు కల్పించడం, కొత్త అసైన్‌మెంట్ భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు.
ప్రభుత్వ జీవోలను మీరు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు.. అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. జీవోల గోప్యతపై హైకోర్టులో వేసిన పిటిషన్లపై ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఈ జన వాహిని చూస్తుంటే వైసీపీ గెలుపు ఖాయం అనిపిస్తోందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట బస్సుయాత్ర బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. ఇసుకరాలనంత జనాలు సభలకు రావడం జగనన్న విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
విజయవాడలో ప్రముఖ హృద్రోగ వైద్య నిపుణుడు గుండెపోటుతో మృతి చెందారు. రమేష్ కార్డియాక్ హాస్పటల్స్లో సుదీర్ఘ కాలంగా కార్డియాలజీ సర్జన్గా పేరొందిన డాక్టర్ పాటిమళ్ల శ్రీనివాస ప్రసాద్ మంగళవారం రాత్రి అనూహ్యంగా సైలెంట్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
మూడు ప్రాంతాలనుండి మూడు సామాజిక రథాలు ప్రజల వద్దకు వస్తున్నాయని మంత్రి జోగి రమేష్ అన్నారు. జగనన్న కటౌట్ పెట్టి బస్ యాత్ర చేస్తేనే గ్రామాలు, పట్టణాలు, జన సంద్రంగా మారుతున్నాయన్నారు.