Local Protest: పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు వద్ద హోంమంత్రి తానేటి వనిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మెరుగు నాగార్జునలను స్థానికులు అడ్డుకున్నారు. దొమ్మేరు దళిత యువకుడు బొంత మహేంద్ర మృతిపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఘటనకు రాష్ట్ర హోంమంత్రి బాధ్యత వహించాలని నినాదాలు చేశారు. కొవ్వూరునియోజక వర్గం దొమ్మేరు గ్రామానికి చెందిన దళిత యువకుడు బొంత మహేంద్ర గ్రామ వైసీపీ వర్గ విభేదాల వివాదంతో మృతి చెందిన ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఘటనకు వైసీపీ పార్టీ, పోలీసులు కారణమని ఆరోపించారు. గ్రామ వైసీపీ గ్రూప్ తగువులు నేపథ్యంలో దళిత యువకుడు బొంత మహేంద్రను కొవ్వూరు పోలీస్ స్టేషన్‌లో నిర్భందించారని మనస్తాపంతో మహేంద్ర బలవన్మరణానికి పాల్పడ్డారని.. దీనికి పూర్తి బాధ్యత హోంశాఖ మంత్రి వహించాలని నినాదాలు చేశారు.
Also Read: Anam Venkata Ramana Reddy: టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై ఆనం సంచలన ఆరోపణలు
దళిత యువకుడిని రోజంతా పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించటంతో భయంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వర్గపోరులో దళిత యువకుడు బలికావటం బాధాకరమని నిరసన వ్యక్తం చేశారు. మొత్తం జరిగిన ఘటనపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేసి మహేంద్ర ఆత్మహత్యకు ప్రేరేపించిన ఘటనలు. చిన్న ప్లెక్సీ వివాదాన్ని పోలీసులు ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో దళిత యువకుడి మృతికి కారణం అయిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. మంత్రులు మృతుడు కుటుంబసభ్యులను పరామర్శించి ప్రభుత్వం తరపున 20 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. మృతుడి కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చారు.