మాండూస్ తుఫాన్ తీరం దాటిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం తెలిపింది. రాత్రి 1:30 గంటలకు పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య మహాబలిపురం సమీపంలో తుఫాన్ తీరం దాటింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాను త్వరలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నందున తమిళనాడులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.
ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ సాంస్కృతిక సమాఖ్య సభ్యులు గురజాడ విశిష్ట పురస్కారాన్ని అందజేశారు. గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, కలెక్టర్ సూర్యకుమారి పాల్గొన్నారు. నవంబర్ 30న గురజాడ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు చేపట్టిన కార్యక్రమానికి "ఇదేమీ ఖర్మ తెలుగు దేశానికి.." అనేది సరిగ్గా సరిపోతుందని ఆయన ఎద్దేవా చేశారు. ప్రజల్లో స్పందన కరువైందని చంద్రబాబుకు అర్థం అయ్యిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. డిసెంబర్ 1న బాధ్యతలు చేపట్టాల్సి ఉండగా.. నేడు ముహూర్తం బాగుండడంతో ఇవాళ స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల వైఎస్సార్ కడప జిల్లా పర్యటన ఖరారైంది. డిసెంబర్ 2, 3 తేదీల్లో లింగాల, పులివెందుల, ఇడుపులపాయ ప్రాంతాల్లో పర్యటించనున్నారు.