ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు బహిరంగ లేఖ రాశారు. ఏపీలో ఇప్పటివరకు ఐటీకి సంబంధించిన పాలసీ తప్ప పని జరగడం లేదని బీజేపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు.
న్యాయాధికారుల శిక్షణ కోసం గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని కాజ వద్ద ఏర్పాటు చేసిన ఏపీ జ్యుడీషియల్ అకాడమీని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రారంభించారు.
విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఏకలవ్య ఆదర్శ పాఠశాలల జాతీయ స్పోర్ట్స్ మీట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ నిర్వహిస్తున్న ఈ స్పోర్ట్స్ మీట్ ప్రారంభ కార్యక్రమాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ సహాయ మంత్రి రేణుక సింగ్ సరుత జెండా ఊపి ప్రారంభించారు.
పల్నాడు జిల్లాలోని మాచర్ల పట్టణంలో శుక్రవారం జరిగిన హింసాత్మక ఘటనలపై రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. జూలకంటి బ్రహ్మారెడ్డి సహా తొమ్మిది మందిపై హత్యాయత్నం కేసు నమోదైంది.
డిఫెన్స్ రంగంలో ఆంధ్రప్రదేశ్కు అతిపెద్ద ప్రాజెక్ట్ రానుంది. ఏపీలోని సత్యసాయి జిల్లా పాల సముద్రంలో భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు మనవడి వివాహ రిసెప్షన్కు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.