ఐఏఎస్ ఇంతియాజ్ అహ్మద్ వీఆర్‌ఎస్‌కు ఏపీ సర్కార్ ఆమోదం తెలిపింది. ఇవాళ ఉదయమే వీఆర్‌ఎస్‌కు ఇంతియాజ్ అహ్మద్ అప్లై చేయగా.. కొద్ది గంటల్లోనే వీఆర్‌ఎస్‌కు సర్కార్ ఆమోదం తెలిపింది. ఒకటి రెండు రోజుల్లో వైసీపీలో ఇంతియాజ్ అహ్మద్ చేరనున్నట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా మహిళలకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. వైఎస్సార్ ఆసరా పథకం నిధుల విడుదలకు సమయం ఖరారైంది. ఇవాళ అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి సీఎం వైఎస్ జగన్ నగదు జమ చేయనున్నారు.
ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థకు ఆధునిక సాంకేతికతను జోడించి విప్లవాత్మక మార్పులకు జగనన్న ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆధునిక సాంకేతికతతో కార్డ్ ప్రైం సాఫ్ట్ వేర్, ఈ-స్టాంపింగ్, గ్రామ/వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలతో ప్రజలకు మరింత సులభతరమైన రిజిస్ట్రేషన్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది.
నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. వైద్యశాఖలో కొత్తగా 2,118 పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అల్లూరి జిల్లాలోని పాడేరు, వైయస్సార్ జిల్లాలోని పులివెందుల, కర్నూలు జిల్లాలోని ఆదోని మెడికల్ కాలేజీల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ సర్కారు నిర్ణయించింది.
గర్భిణులకు ఆంధ్రప్రదేశ్ సర్కారు శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో గర్భిణులకు అత్యాధునిక టిఫా స్కానింగ్ సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ స్కాన్‌ను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కార్డుదారులైన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉచితంగా అందించనున్నారు.
రైతాంగ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ఆఖరి ధాన్యం గింజ కొనే వరకు జనసేన ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు.
విద్యావ్యవస్థలో సంస్కరణలు చేయడంతో పాటు అందరికి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. ఇప్పటికే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడమే కాకుండా.. విద్యార్థులు విద్యకు దూరం కావొద్దని అనేక పథకాలను తీసుకొచ్చారు.
మార్గదర్శి కేసులో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దాఖలు చేసిన పిటిషన్‌పై రామోజీరావుకు సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లో సమాధానం ఇవ్వాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
బోషడీకే అనే పదానికి సీఎం తనకు కావాల్సిన అర్ధం వెతుక్కుంటున్నారు. బోష్ డీకే అని గుజరాత్ లోని ఓ గ్రామం ఉంది. ఆ పదానికి అమాయకులు అనే అర్ధం కూడా ఉంది అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల అన్నారు. ఏపీలో గంజాయి సాగు.. సరఫరా జరుగుతోందంటూ పక్క రాష్ట్రం డీజీపీనే అంటున్నారు. పక్క రాష్ట్రం సీఎం గంజాయి విషయంలో తీసుకుంటున్న చర్యలు ఏపీ సీఎం తీసుకుంటే మేమూ హర్షిస్తాం. టీడీపీ కార్యాలయంపై దాడిలో సుమారు పది మంది…