Andhrapradesh: విద్యావ్యవస్థలో సంస్కరణలు చేయడంతో పాటు అందరికి నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. ఇప్పటికే ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడమే కాకుండా.. విద్యార్థులు విద్యకు దూరం కావొద్దని అనేక పథకాలను తీసుకొచ్చారు. పేదవారికి ఆర్థికపరంగా విద్య దూరం కాకూడదని.. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూల్స్‌కు ధీటుగా తయారు చేసేందుకు బడి నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తాజా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కళాశాలలకు మాత్రమే పరిమితమైన సెమిస్టర్ విధానాన్ని ఇక మీదట పాఠశాలల్లో కూడా ప్రవేశపెట్టేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానాన్ని తీసుకొస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
Leopard in Hetero Labs: చిరుత చిక్కింది.. ముప్పుతిప్పలు పెట్టింది..
2023-24 విద్యా సంవత్సరం నుంచి స్కూల్స్‌లో ఈ సెమిస్టర్ విధానం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో ముందుగా వచ్చే ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో..1-9వ తరవగతి వరకు రెండు సెమిస్టర్‌లు అమల్లోకి వస్తాయని.. అలానే 2024-25 నుంచి పదో తరగతికి కూడా సెమిస్టర్ విధానం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో వెల్లడించారు. అందుకు సంబంధించిన పాఠ్య పుస్తకాలను కూడా పంపిణీ చేయనున్నారు. ఈమేరకు అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు, ఆర్జేడీలకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.