ఏపీలో కరెన్సీ నోట్లకు రెక్కలొచ్చాయి. ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం ఉండటంతో పార్టీలు, అభ్యర్థులు స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో.. ఓటర్లను ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నారు. ఇన్నాళ్లు కలుగుల్లో దాచిపెట్టిన డబ్బులను బయటకు తీస్తున్నారు. బినామీల చేతుల మీదుగా కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. అక్కడక్కడ తనిఖీల్లో దొరికిందే కొంత.. ఇంకా దొరకని సొమ్ము వందల కోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఎన్నికల్లో నగదు ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నికల కమిషన్ కూడా కొరడా ఝులిపిస్తుంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం.. నాపై తెరచాటు రాజకీయం చేయడం కాదు.. జూనియర్ ఆర్టిస్టులతో మాట్లాడించడం కాదు.. నీకు దమ్ముంటే ప్రెస్‌మీట్ పెట్టి.. నాపై మాట్లాడు.. నాపై విమర్శలు చేయి.. నన్ను ప్రశ్నించు అంటూ ప్రతీ సమావేశంలోనూ సవాల్ చేస్తూ వస్తున్నారు.
ఏపీలో ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. రేపు(శుక్రవారం) ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు విద్యామండలి అధికారికంగా ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌లో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే ఘన విజయం అన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి.. కోడ్ వచ్చిన తర్వాత ఈసీ ఏ పార్టీ మీద ఎక్కువ కేసులు ఉన్నాయో చూడండి.. వైసీపీకి ఎక్కువగా ఎలక్షన్ కమిషన్ నుంచి నోటీసులు వస్తున్నాయి.. కేసులు బుక్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే మాదే విజయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ గ్రామంలోని ఎస్ఆర్ కన్వెన్షన్‌లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన గన్నవరం నియోజకవర్గ స్థాయి యాదవుల ఆత్మీయ సమావేశంలో యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.