ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. ట్రైనీ నర్సుపై రోగి సహాయకుడు లైంగికదాడి.. కేకలు వేయడంతో..!
చిన్నారులు, యువతులు, వృద్ధులు అనే తేడా లేకుండా మహిళలపై లైంగిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. తాజాగా, విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వలోనూ నర్సుపై లైంగిక దాడికి యత్నించాడో వ్యక్తి.. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ట్రైనీ నర్సుపై లైంగికయత్నానికి పాల్పడ్డాడు ఓ రోగి సహాయకుడిగా ఉన్న వ్యక్తి.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గంట్యాడ మండలానికి చెందిన గోపి.. అనారోగ్యంపాలైన తన తల్లిని ఆస్పత్రిలో చేర్పించాడు.. ఇక, వారం రోజులుగా ఆసుపత్రిలోనే తన తల్లికి సహాయకుడిగా ఉంటున్నాడు గోపి.. అయితే, మంగళవారం రాత్రి విధుల్లో ఉన్న ట్రైనీ నర్సుపై కన్నేశాడు గోపి.. ఆమె నీళ్లు తాగేందుకు వెళ్లగా.. ఆమె వెనుక నుంచి నెమ్మదిగా వెళ్లి.. ఆ గది తలుపులు మూశాడు.. ట్రైనీ నర్సుపై బలవంతంగా లైంగిక దాడికి యత్నించాడు.. ఊహించని పరిణామంతో షాక్ తిన్న నర్సు.. గట్టిగా కేకలు వేసింది.. నర్సు కేకలు విని అప్రమత్తమైన తోటి సిబ్బంది.. తలుపులు బాధడంతో.. వారిని నెట్టుకుంటూ పారిపోయే ప్రయత్నం చేశాడు గోపి.. అదే సమయంలో ఆపరేషన్ గది అద్దాలు పగలగొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు.. ఇక, గోపిని అదుపులోకి తీసుకున్న ఆస్పత్రి సెక్యూరిటీ గార్డులు.. గాయపడిన గోపికి మొదట వైద్య సిబ్బందిచే చికిత్స అందించారు.. అనంతరం గోపీని పోలీసులకు అప్పజెప్పారు.. నర్సుపై అఘాయిత్యానికి పాల్పడిన గోపి.. మద్యం మత్తులో ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.. పట్టుబడిన గోపి.. మా అమ్మకు బాగోలేక ఆస్పత్రికి వచ్చాం.. నన్ను క్షమించండి.. వదిలేయండి అంటూ.. సెక్యూరిటీ సిబ్బందిని వేడుకున్న వీడియో సోషల్ మీడియాకు ఎక్కింది.
సీఎం జగన్‌పై రాయి దాడి కేసు కీలక పురోగతి
విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై రాళ్ల దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది.. అయితే, రాత్రి సమయంలో రాళ్ల దాడి జరగడంతో ఈ కేసులు ఛేదించడంపై పోలీసులకు సవాల్‌గా మారింది.. అయినా వెనక్కి తగ్గకుండా.. కేసు దర్యాప్తు చేపట్టిన బెజవాడ పోలీసులు కీలక పురోగతి సాధించారు.. దాడికి పాల్పడిన వారిని, ఇక వారికి సహకరించిన వారిని కూడా ఈ రోజు అరెస్ట్ చూపించే అవకాశం ఉంది.. ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు విజయవాడ పోలీసులు.. ఆ ఐదురు సభ్యుల బృందంలో ఒకరు దాడి చేసినట్టు దాదాపు నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం.. ఈ సాయంత్రం నిందితులను మీడియా ముందు హాజరుపరిచే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
మరోసారి ఎంపీగా గెలవబోతున్నా.. ఏడు నియోజకవర్గాల్లోనూ నాకే మెజార్టీ..!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు ప్రచారంపై ఫోకస్ పెట్టాయి.. ఇక, మరోసారి బందరు ఎంపీగా గెలవబోతున్నాను అనే ధీమా వ్యక్తం చేశారు బందరు లోక్ సభ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి.. మచిలీపట్నం ఎంపీగా గత ఐదేళ్ల కాలంలో పోర్టు సహా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. ఇప్పుడు గెలిచిన తర్వాత ఆ అభివృద్ధిని కంటిన్యూ చేస్తాం అన్నారు.. ఇక, బందరు లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ నాకు మెజార్టీ వస్తుందనే నమ్మకం ఉందన్నారు.. మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు సహా టీడీపీ, బీజేపీ నేతలు, కార్యకర్తలు పూర్తిగా తనకు సహకరిస్తున్నారి తెలిపారు.. మరోవైపు.. మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయం విదితమే కాగా.. ఆయనపై స్పందించిన బాలశౌరి.. సింహాద్రి చంద్రశేఖర్ మంచి డాక్టరే.. కానీ, రాజకీయాలకు కొత్త అన్నారు. నేను నా ప్రత్యర్థులను విమర్శించడం కంటే.. నేను పనితనంతోనే పైచేయి సాధిస్తాను అని వెల్లడించారు మచిలీపట్నం లోక్‌సభ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి..
చంద్రబాబువి వీలుకాని హామీలు.. మళ్లీ మోసం చేసేందుకు సిద్ధమయ్యారు..
వీలుకాని హామీలు ఇస్తూ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారు అంటూ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లుపాటు తాత్కాలిక రాజధాని నిర్మాణం అని సొంత అజెండాతో పని చేసిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు.. ఐదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకున్న ఘనత చంద్రబాబు నాయుడుదే అని విమర్శించారు. ఇప్పుడు ఎన్నికలు వస్తుండడంతో నేడు సూపర్ సిక్స్… మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ.. అంటూ మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యాడని ఆరోపించారు. ఎన్నికల సమయంలో అమలు చేయడానికి వీలుకాని హామీలు చంద్రబాబు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
ప్రజలకు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చక పోతే వదిలిపెట్టం
సోషల్ మీడియా వేదిక రేగా కాంతారావు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రేవంత్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఉండాలని మస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, ప్రజలకు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చక పోతే వదిలిపెట్టమన్నారు రేగా కాంతా రావు. కానీ రేవంత్ ప్రభుత్వానికి ఎంపీ ఎన్నికల్లో ప్రజా తిరుగుబాటు తప్పదని, ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఏ పరిస్థితులు సంభవిస్తాయో అని ప్రజల్లో చర్చ ఉందన్నారు. ఖమ్మం, నల్గొండ మానవ బాంబులతో ప్రమాదం ఉంది ప్రభుత్వం కూలడం ఖాయమన్నారు రేగా కాంతా రావు. యావత్ రాష్ట్ర ప్రజలు కెసిఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారు చిన్న కోపం వచ్చింది ఇంత ప్రమాదం జరుగుద్దని ప్రజలు ఊహించలేదని, ఎంపీ ఎన్నికల్లో కార్ రిపేర్ అయ్యి దూకుడు పెంచింది కాంగ్రెస్ అనుకునే 14 సీట్లు కార్ ఖాతా లోనే పడతాయన్నారు రేగా కాంతా రావు. రేవంత్ కు భంగపాటు తప్పదు ప్రజలు కర్రుకాల్చి వాతపెడతారు రేగా కాంతా రావు. రుణమాఫీ అయినోళ్లంతా బ్యాంకులకు వెళ్లి రూ.2 లక్షలు తెచ్చుకోవాలని, డిసెంబర్ 9న అధికారంలోకి వచ్చిన వెంటనే మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని, మరి ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఇలా ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం విస్మరించిందని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక గంట కూడా కరెంట్ కోతలు లేవని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరెంట్ కోతలు కరువు రాష్ట్రంలో తాండవిస్తోందని ఆయన విమర్శించారు. రోజురోజుకు నీటి సమస్య పెద్దగా మారుతోందని, పరిష్కరించాలని కోరుతున్నా ప్రభుత్వంకు చెవికి ఎక్కడం లేదన్నారు రేగా కాంతారావు.
బీజేపీ కూటమి ఈ సారి 400 సీట్లు సాధిస్తుందా..? వివిధ సంస్థల ఒపీనియన్ పోల్స్ ఏం చెప్పాయి..
లోక్‌సభ ఎన్నికలు ప్రారంభం కావడానికి మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు విడుదలవుతాయి. అయితే, ఈసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 400 సీట్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈసారి బీజేపీని గద్దె దించుతామని ప్రతిపక్ష ఇండియా కూటమి చెబుతోంది. ఒపీనియన్ పోల్స్ ప్రతీసారి కరెక్ట్ అవుతాయనే గ్యారెంటీ లేదు. అయినప్పటకీ అన్ని సంస్థలు ఒపీనియన్ పోల్స్ మాత్రం ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని తెలిపాయి. బీజేపీ స్వతహాగా 300 స్థానాలు దాటుతుందని అంచనా వేస్తున్నాయి. మరోసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం కలగానే మిగులుతుందని చెబుతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగం, ద్రవ్యోల్భణం వంటి సమస్యలు ఉన్నప్పటికీ రామ మందిరం, విదేశాల్లో భారత పరపతి పెరగడం వంటివి బీజేపీకి ప్లస్ అవుతున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
భారత్-దుబాయ్ మధ్య విమాన సర్వీస్‌లు రద్దు.. ఎప్పటివరకంటే..!
ఎడారి దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. మునుపెన్నడూ లేనంతగా కుండపోత వర్షం కురిసింంది. భారీ ఎదురుగాలులు, వడగండ్ల వర్షంతో దుబాయ్‌ను అతలాకుతలం చేసింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. భారీ ప్రవాహనికి కార్లు, బైకులు, వస్తువులు కొట్టుకుపోయాయి. పెద్ద ఎత్తున నీరు నిలిచిపోవడంతో ఇళ్లు మునిగిపోయాయి. దీంతో ప్రజలు హడలెత్తిపోయారు. ఇక ఎయిర్‌పోర్టులోకి వర్షపునీరు చేరిపోవడంతో విమానాలు కూడా మునిగిపోయాయి. పెద్ద ఎత్తున రోడ్లు కోతకు గురయ్యాయి. ఏడాది వర్షమంతా ఒక్క మంగళవారమే కొన్ని నిమిషాల్లో కురిసి బెంబేలెత్తించింది. ఇదిలా ఉంటే భారీ వర్షాలు దుబాయ్‌ను అతలాకుతలం చేయడంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై వర్షపునీరు నిలిచిపోవడంతో 28 విమాన సర్వీసులను రద్దు చేసినట్లు సివిల్ ఏవియేషన్ శాఖ అధికారులు తెలిపారు. ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్లే 15 విమానాలు.. అక్కడి నుంచి వచ్చే 13 విమానాలను రద్దు చేసినట్లు వెల్లడించారు. దీనిపై ఎప్పటికప్పుడు ప్రయాణికులకు సమాచారం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయన్నారు. వీలైనంత వేగంగా ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు దుబాయ్ విమానాశ్రయ అధికార ప్రతినిధి తెలిపారు.
న్యూయార్క్లో కాల్పులు కలకలం.. నలుగురిని కాల్చిన దుండుగులు, ఒకరు మృతి
న్యూయార్క్లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన బ్రోంక్స్‌లో చోటు చేసుకుంది. దుండగులు స్కూటర్లపై వెళుతూ కాల్పులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఒక సిగ్నల్ వద్ద రెండు స్కూటర్లపై వచ్చిన దుండగులు దాదాపు 10 షాట్లు కాల్చినట్లు అసిస్టెంట్ పోలీస్ చీఫ్ బెంజమిన్ గుర్లే వెల్లడించారు. కాల్పుల ఘటనలో రోడ్డుపక్కన నిలబడిన ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో వ్యక్తికి బుల్లెట్ ఛాతీలోకి వెళ్లడంతో మృతి చెందినట్లు గుర్లే చెప్పారు. కాల్పులకు పాల్పడినప్పుడు దుండుగులు ముసుగులు ధరించారని.. ఈ క్రమంలో వారిని గుర్తించడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. కాగా.. అనుమానం ఉన్న ఓ వ్యక్తిని మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఆ వ్యక్తి కాల్పుల్లో పాల్గొన్నాడా లేదా అన్నది పోలీసులకు తెలియదని గుర్లే చెప్పారు.
కేకేఆర్ మ్యాచ్లో చాహల్ చెత్త రికార్డు..!
ఐపీఎల్ 2024లో భాగంగా.. మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో రాజస్థాన్.. 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ చరిత్రలో ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన స్పిన్ బౌలర్‌గా చాహల్ నిలిచాడు. 2015లో ఆర్సీబీ తరుఫున ఆడుతున్నప్పుడు ఎక్కువ పరుగులు ఇచ్చాడు. తాజాగా.. తన పాత రికార్డును తానే బద్దలుకొట్టుకున్నాడు. నిన్న కేకేఆర్ తో మ్యాచ్ లో రాజస్థాన్ బౌలర్లలో చాహల్ అత్యధిక పరుగులు ఇచ్చాడు. చాహల్ తన నాలుగు ఓవర్లలో 54 పరుగులిచ్చి 1 వికెట్ తీశాడు. కాగా.. ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్ తరఫున అత్యధిక పరుగులు అందించిన స్పిన్ బౌలర్‌గా యుజ్వేంద్ర చాహల్ తన పేరును నమోదు చేసుకున్నాడు. చాహల్ ఐపీఎల్ లో అద్భుత స్పెల్ బౌలింగ్ చేయగల సత్త ఉంది. కానీ.. నిన్నటి మ్యాచ్ లో పరుగులు సమర్పించుకున్నాడు. అంతకుముందు 2011లో మొహాలీలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో దివంగత క్రికెటర్ షేన్ వార్న్.. 50 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఇప్పుడు అతడిని చాహల్ అధిగమించాడు. ఇదిలా ఉంటే.. రాజస్థాన్ బౌలరల్లో అశ్విన్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. నాలుగు ఓవర్ల స్పెల్‌లో వికెట్ పడకుండా 49 పరుగులు ఇచ్చాడు. మరోవైపు.. ఐపీఎల్‌లో 200 వికెట్లు తీయడానికి యుజ్వేంద్ర చాహల్ ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు చాహల్ 152 మ్యాచ్‌ల్లో 199 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించడం కోసం కేవలం ఒక్క వికెట్ మాత్రమే కావాలి. ఐపీఎల్‌లో 200 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా చాహల్ నిలుస్తాడు. ప్రస్తుతం పర్పుల్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాడు. ప్రస్తుత సీజన్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన చాహల్.. 12 వికెట్లు తీశాడు.
90స్ టీమ్ నుంచి మరో నవ్వుల జల్లు.. కలర్స్ స్వాతి టైటిల్ రోల్లో ‘టీచర్’
ఆద్యంతం కడుపుబ్బ నవ్వించే నవ్వుల జల్లుతో టీచర్ అనే సినిమా తెరకెక్కుతోంది. తెలంగాణలోని అంకాపూర్ అనే గ్రామంలో ఉన్న ముగ్గురు డల్ స్టూడెంట్స్ కి సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో టీచర్‌గా కలర్స్ స్వాతి నటిస్తున్నారు. అడ్డూఅదుపూ లేకుండా అల్లరి చేసే ముగ్గురు విద్యార్థులు టీచర్‌ని కలిసిన తర్వాత ఏం జరిగింది? వాళ్ల జీవితాలు ఎలా మారాయి? అనేది హృద్యంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఇటీవల 90స్- ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న టీమ్ నుంచి ఈ సినిమా వస్తుండడంతో సరదా సన్నివేశాలు, సంభాషణలు, అందమైన, అమాయకమైన ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ప్రయాణం… ప్రేక్షకుల మనసులను టచ్ చేస్తుందనడంలో అసలు సందేహం లేదని చెప్పొచ్చు. 90స్- ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ డైరెక్టర్ ఆదిత్య హసన్ ఈ సినిమాను డైరక్ట్ చేశారు. నవీన్ మేడారం ఈ సినిమాను నిర్మించారు.
స్త్రీ సాధికారత కోసం సంయుక్త “ఆదిశక్తి”
మలయాళం నటి సంయుక్త మీనన్ ప్రస్తుతానికి తమిళం, మలయాళం, తెలుగు అని తేడా లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆమె చేతిలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ఏకంగా బాలీవుడ్ నుంచి కూడా ఆమెకు పిలుపు వచ్చింది అంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ ప్రచారం సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఆమె తీసుకున్న ఒక నిర్ణయం ఆమె మీద ప్రశంసలు కురిపిస్తోంది. నిస్సహాయులైన మహిళలకు అండగా ఉండేందుకు సంయుక్త ముందుకు వచ్చింది. సమాజంలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలకు వారు ఎదుర్కొంటున్న సమస్యలకు తన వంతు పరిష్కారం సూచించేందుకు, సహాయం అందించేందుకు ఆమె ఒక అడుగు ముందుకు వేసి ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఆదిశక్తి అనే ఒక సేవా సంస్థను స్థాపిస్తున్నట్లు అనౌన్స్ చేసింది.