Palnadu: పల్నాడులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ సానుభూతిపరులను పరామర్శించేందుకు చలో మాచర్లకు పిలుపునిచ్చారు ఆ పార్టీ నేతలు. మాచర్లలో ఎలాంటి రాజకీయ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. అయినా సరే మాచర్లకు వెళ్తామంటూ టీడీపీ సీనియర్ నేతలు ప్రకటించారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. మాచర్లకు వెళ్లకుండా టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమాను గృహనిర్బంధం చేశారు పోలీసులు. ఆయనతో పాటు ముందస్తుగా పలువురు టీడీపీ నేతలను గృహనిర్బంధం చేశారు. ఎక్కువ మంది ఒకే చోట చేరకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
Read Also: Ananthapur: ఫైర్ క్రాకర్స్‌పై అనంతపురం జిల్లాలో తాత్కాలికంగా నిషేధం
పల్నాడులో హై టెన్షన్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. పల్నాడులో పదిరోజులుగా 144 సెక్షన్ కొనసాగుతోంది. పల్నాడు ప్రాంతంలోని సమస్యత్మక పట్టణాల్లో పదిరోజులుగా షాపులు మూసివేస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇప్పటికీ అక్కడక్కడ చెదురుముదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గ్రామాల్లో రాజకీయ పార్టీల కార్యకర్తలు కవ్వింపు చర్యలు చేస్తున్నారు. ఇప్పటికే ఘర్షణలో పాల్గొని, దాడులు చేసిన వారిపై కేసులు పెట్టారు పోలీసులు. నిందితులుగా ఉన్న వారి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.