ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతి పనులు చకాచకా జరిగిపోతున్నాయి. అమరావతిలో సీఆర్డీఏ అధికారులు కొన్ని పనులను ప్రారంభించారు. ముఖ్యంగా అమరావతిలోని ట్రంక్ రోడ్ల వెంబడి, నిర్మాణంలో ఉన్న భవన సముదాయాల ప్రాంతాల్లో పెరిగిన ముళ్ల కంపలను వెంటనే తొలగించాలని ఆదేశాలు రావటంతో ఈ పనులు ప్రారంభమయ్యాయి.
కృష్ణాజిల్లా గన్నవరం మండలం కేసరపల్లి వద్ద చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదిక సిద్ధమవుతోంది. సభా వేదిక పనులు దగ్గరుండి అధికారులు, టీడీపీ నాయకులు పరివేక్షిస్తున్నారు. ఈనెల 12వ తేదీ టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సభా వేదిక నిర్మాణం వద్ద టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రత్యేక దళాలతో భారీ బందోబస్తు చేసేలా ప్రణాళిక ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి మరొకరికి కేంద్ర మంత్రి పదవి దక్కింది. బీజేపీకి చెందిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మను కేంద్ర కేబినెట్లోకి తీసుకోనున్నారు. ఈ మేరకు పీఎంవో నుంచి శ్రీనివాస్ వర్మకు సమాచారం వచ్చింది.
నేడు ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. దీంతో మోదీ క్యాబినెట్లో ఈసారి ఎవరికి చోటు దక్కుతుందనే ఆసక్తి నెలకుంది. అయితే, ఎన్డీయేలో బీజేపీ తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించిన టీడీపీకి మంత్రివర్గంలో ప్రాధాన్యత దక్కనుంది. కేంద్రమంత్రివర్గంలో ఇద్దరు టీడీపీ నేతలకు ఛాన్స్ దక్కినట్లు తెలుస్తోంది. అది ఎవరో తెలియాలి అంటే కింది వీడియో క్లిక్ చేసి చుడండి.
Yellow Alert: నైరుతి రుతుపవనాల విస్తరణతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి.
అమరావతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకార సమయంలో మార్పులు చేశారు. ఈ నెల 12వ తేదీన ఉదయం 09:27 గంటలకు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఏపీ సీఎంలో ట్వీట్ చేసింది.
సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంపై ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.