శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో టీడీపీ కార్యకర్తలు , అభిమానుల మధ్య బాలయ్య తన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. సుగూరు ఆంజనేయస్వామి దేవాలయం వద్ద ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇటీవల కురిసిన వర్షాల వల్ల జలాశయాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద నీరు స్వల్పంగా ప్రారంభమైంది. ఎగువ పరివాహక ప్రాంతమైన సుంకేసుల జలాశయం నుంచి 4,052 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది.
ఏపీ కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం 11.27 గంటలకు గన్నవరం సమీపంలో కేసరపల్లిలో ప్రమాణస్వీకారం జరగనుంది. ఈ కార్యక్రమం కోసం అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ప్రధాని మోడీ సహా పలువురు జాతీయ నేతలు హాజరుకానుండడంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం టోకెన్ లేని భక్తులకు 16 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వదర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్లో వేసవి సెలవులను ఈ నెల 12 వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా.. తాజా మార్పుతో 13న రీఓపెన్ అవుతాయని సర్కారు తెలిపింది.
కేంద్ర కేబినెట్లో చోటు దక్కినందుకు హర్షం వ్యక్తం చేశారు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు. కాసేపట్లో కేంద్ర మంత్రిగా ప్రమాణం చేయనున్న తరుణంలో ఆయన సోషల్ మీడియాలో తన సందేశాన్ని విడుదల చేశారు. ఈ ఆనందానికి కారణమైన శ్రీకాకుళం జిల్లా ప్రజలకు ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీకి చెందిన నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మను కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన భావోద్వేగానికి గురై... సోము వీర్రాజు కాళ్లకు మొక్కి.. ఆలింగనం చేసుకున్నారు.