గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ( ANU) దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో మూడు ( విశాఖ, కర్నూలు, అమరావతి ) రాజధానులకు అనుకూలంగా సమావేశం నిర్వహించిన వీసీ రాజశేఖర్ వెంటనే రాజీనామా చేయాలంటూ అమరావతి ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్నికైయ్యారు. ఏడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన గోరంట్లకు ప్రొటెం స్పీకర్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు.
గృహనిర్మాణ నిధులను జగన్ ప్రభుత్వం మళ్లించిందని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్ధసారథి కీలక కామెంట్లు చేశారు. రిషికొండ నిర్మాణానికి గృహ నిర్మాణ నిధులను మళ్లించి ఉండొచ్చని మంత్రి ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఖరారు చేసిన గృహ నిర్మాణ లబ్దిదారుల జాబితాను మార్చేదే లేదని ఆయన స్పష్టం చేశారు.