సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. ప్రజల అవగాహన లేమిని తెలివిగా వాడుకుంటూ కోట్లు నొక్కేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని పోలీసులు ఎంతగా హెచ్చరిస్తున్నా.. పదే పదే నేరాలు జరగడం తీవ్రతకు అద్ధం పడుతోంది. బెజవాడలో గత 10 రోజుల్లో 5గురు సైబర్ నేరగాళ్ల బారిన పడి లక్షల్లో డబ్బుల్లో పోగొట్టుకొని పోలీసులను ఆశ్రయించారు.
మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రిలో కిడ్నాప్ ఘటనలో వైద్య సిబ్బందిపై వేటు పడింది. ఏడుగురు సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు. నలుగురు నర్సులు, ఎఫ్ఎన్వో, ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని విధుల నుంచి తొలగించారు.
విజయనగరం జిల్లాలో ఐదు నెలల పాపపై జరిగిన అత్యాచారం ఘటన బాధిత కుటుంబాన్ని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పరామర్శించారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఐదు నెలల పాపపై 40 ఏళ్ల మానవ మృగం విరుచుకుపడిందని.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే కఠిన శిక్ష పడేలా చేస్తామని మంత్రి పేర్కొన్నారు.
కడప జిల్లాలో కులహంకార దాడి ఘటన చోటుచేసుకుంది. ఒంటిమిట్ట మండలం పెన్న పేరూరు గ్రామంలో కులహంకార దాడి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కదిరి ప్రభాకర్ అనే వ్యక్తిపై గజ్జల సుబ్బారెడ్డి అనే వ్యక్తి కర్రతో కొట్టడంతో పాటు మరిగే నూనెను పోసినట్లు తెలిసింది. కదిరి ప్రభాకర్ పరిస్థితి విషమంగా ఉండడంతో రిమ్స్‌కు తరలించారు.