పల్నాడు జిల్లా వినుకొండలో రెండ్రోజుల క్రితం ప్రత్యర్థి దాడిలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని రషీద్ నివాసానికి వెళ్లిన జగన్.. బాధిత కుటుంబానికి అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు.
Gandharva mahal: బర్మా టేకు, విదేశాల నుంచి విద్యుత్ దీపాలు, బెల్జియం అద్దాలు ఇలా ఎన్నో ప్రత్యేకతలు కలిగిన గంధర్వ మహాల్ వందేళ్లు పూర్తి చేసుకుంది. మైసూర్ ప్యాలెస్ మరించేలా 1924లో నిర్మించిన ఈ అద్భుత కట్టడం తూర్పుగోదావరి జిల్లాకే ప్రత్యేకంగా నిలుస్తోంది.
గత ప్రభుత్వ హయాంలో మద్యం అక్రమాలపై సీఐడీ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఏపీబీసీఎస్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి అక్రమాలపై సీఐడీ కూపీ లాగుతోంది. ఎక్సైజ్ శాఖలో జరిగిన అవకతవకలు.. అక్రమాలు జరిగిన తీరుపై నాటి ఉన్నతాధికారుల నుంచి వివరాలను సీఐడీ తీసుకుంటోంది.
కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయం నుంచి పలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సాంకేతిక లోపం వల్ల ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ సర్వర్లు నిలిచిపోయాయి. దీనివల్ల పలు విమాన సర్వీసులు ఆలస్యం కాగా.. బోర్డింగ్ పాసులపై మాన్యువల్‌గా రాసి ప్రయాణికులను పంపిస్తున్నారు.
ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు జలాశయాలకు వరద నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తోన్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. గతవారం రోజులుగా కురుస్తోన్న వర్షాలకు కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణ్‌పూర్ జలాశయాలు నిండిపోయాయి. దీంతో నీటిని విడుదల చేస్తున్నారు.
ఏపీ మంత్రి అనగాని సత్య ప్రసాద్‌ను హీరో సుమన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హీరో సుమన్ మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల తరువాత అందరూ బిజీగా ఉన్నారని ఇప్పటి వరకూ ఎవ్వరిని కలవలేదని.. రేపు ఓ కార్యక్రమం ఉందని, అందుకే ఒక రోజు ముందు వచ్చి అందర్ని మర్యాదపూర్వకంగా కలుస్తున్నామన్నారు.