చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన విడుదల చేశారు. చేనేతకు జీవం పోయాలని ఆయన సూచించారు. దేశంలో అతిపెద్ద అసంఘటిత ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే రంగాల్లో చేనేత ఒకటి అని.. చేనేత ఒక కళాత్మకమైన పరిశ్రమ అంటూ చెప్పుకొచ్చారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థలు, సహకార సంఘాల్లో ముగ్గురు పిల్లలుంటే పోటీకి అనర్హత నిబంధనను తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ.. వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఇద్దరు పిల్లలే ఉండాలన్న నిబంధనను తప్పిస్తూ బిల్లు పెట్టనుంది.
Amaravati: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులకు తొలి అడుగు పడబోతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో వివక్షకు గురైన అమరావతి రాజధానిని మళ్లీ గాడిన పెట్టేందుకు వీలుగా టీడీపీ సర్కార్ తీసుకున్న చర్యలలో భాగంగా ఇవాళ (బుధవారం) తొలి అడుగుగా కంప చెట్లు, పిచ్చి చెట్లు, తుమ్మ చెట్ల తొలగింపు కార్యక్రమం ప్రారంభం అవుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో మరో దారుణం వెలుగు చూసింది.. వివాహేతర సంబంధంతో సహజీవనం చేస్తున్న పార్వతి అనే మహిళపై ప్రియుడు మోహన్ పెట్రోల్ పోసి నిప్పంటించిన సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో తీవ్ర కలకలం రేపుతోంది..
పెట్టుబడులు మౌళిక సదుపాయాల శాఖ రివ్యూలో అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి కీలక విషయాలు తీసుకొచ్చారు. వివిధ రకాల కార్పొరేషన్లలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని అధికారులు సీఎం చంద్రబాబుకు చెప్పారు. ఫైబర్ నెట్ కనెక్షన్ల వివరాలను సీఎం చంద్రబాబు అడిగితే అవి లేవని అధికారులు చెప్పడంతో.. కనెక్షన్ల సొమ్ములను కూడా దోచుకున్నారా అంటూ ఆశ్చర్యపోయారు.
మదనపల్లె సబ్ కలెక్టరేట్లో ఫైల్స్ దగ్ధం కేసులో కీలక పరిణామం.. ఫైల్స్ దగ్ధం కేసును సీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు. రెండు రోజుల్లో కేసు ఫైల్‌ను సీఐడీకి అప్పగించనున్నారు పోలీసులు.