Tribal Students Death: పార్వతీపురం మన్యం జిల్లాలో అనారోగ్యంతో గిరిజన విద్యార్థినుల మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. పార్వతీపురం పరిధిలోని కురుపాం గిరిజన సంక్షేమ ఆశ్రమ గురుకులంలో జ్వరం, జాండిస్ లక్షణాలతో విద్యార్థినుల వరుస మరణాలు సంచలనం రేపుతున్నాయి.
Womens Protest: గుంటూరు ఎస్పీ కార్యాలయం ముందు మహిళల ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అనుచరులు తమపై దాడి చేసి ఇబ్బంది పెట్టారంటూ కోటేశ్వరమ్మ అనే మహిళ ఆమె కూతురుతో కలిసి ఎస్పీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. తమపై దాడి జరిగిందని మేడికొండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే, సీఐ దురుసుగా వ్యవహరిస్తున్నారు అని బాధిత మహిళలు పేర్కొంటున్నారు.
Cyclone Alert: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య దిశగా పయనించి రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ నెల 3వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా బలపడే ఛాన్స్. ఉత్తర కోస్తా- దక్షిణ ఒడిస్సా మధ్య తీవ్ర వాయుగుండం తీరం దాటనుంది.