వైసీపీ తీరుపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం టెండర్ల విషయంలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల్లో తన కోసం పని చేసిన కార్యకర్తలను ఆర్థికంగా ఆదుకుంటే తప్పా..? అని ప్రశ్నించారు. బార్లు.. మద్యం వ్యాపారాలను గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు లాక్కొన్నారు.. మద్యం టెండర్లు వేయొద్దని తానెవర్నీ బలవంతం చేయలేదు..? అని చెప్పారు. నెల్లూరులో ఎవరైనా వ్యాపారాలు చేసుకోవచ్చు.. మద్యం టెండర్లు వేసుకోవచ్చని అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత.. వరద సాయంపై చర్చకు రావాలని సవాల్ చేశారు.. వరద సాయంపై చర్చించడానికి మేం సిద్ధం.. వైసీపీ నుంచి చర్చకు ఎవరైనా వస్తారా..? అని చాలెంజ్ చేశారు..
అక్కినేని నాగార్జున న్యాయస్థానానికి వెళ్తే మేమెందుకు స్పందించాలి.. అది పూర్తిగా ఆయన వ్యక్తిగతం అన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్.
తాడిపత్రి అభివృద్ధి కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశారు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి.. కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాం.. ప్రజలు తమ బంధువులు.. స్నేహితులు సహకరించాలని చేతులు జోడించి విన్నవించారు. ఇక, తాడిపత్రి చుట్టుపక్కల ఉన్న బైపాస్ రోడ్లలో చెత్తవేస్తే కేసులు నమోదు చేస్తామంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి.
పర్యావరణ పరిరక్షణ కు నిపుణులు, మేధావులు, ఎన్జీవోల సూచనలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయి అన్నారు.. ఈ వర్క్షాపు ద్వారా పరిశ్రమల ఏర్పాటు, పర్యావరణ పరిరక్షణ రెండు అంశాలపై వేసే అడుగులపై అందరికీ స్పష్టత వస్తుందన్నారు.. ఈ ఐదేళ్ల కాలంలో ఎంతవరకు కాలుష్యాన్ని నియంత్రించాలనే అంశంపై ఆలోచన చేస్తున్నాం.. పీసీబీ ఛైర్మన్ కు నా ఆలోచన చెప్పిన వెంటనే.. ఈ వర్కుషాపును ఏర్పాటు చేశారని తెలిపారు పవన్ కల్యాణ్
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం భూపాలపట్నంలో డ్రగ్స్ కలకలం సృష్టించింది.. భూపాలపట్నంలోని పుట్టినరోజు వేడుకలు జరుగుతున్న ఓ ఫంక్షన్ హాల్ వద్ద కారులో డ్రగ్స్ ప్యాకెట్లు బయటపడ్డాయి. కారులో ముగ్గురు యువకులు డ్రగ్స్ సేవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
మూలానక్షత్రంలో సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తోన్న కనకదుర్గమ్మను తన కూతురు ఆధ్యతో వెళ్లి దర్శించుకున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆలయ మర్యాదలతో పవన్కు స్వాగతం పలికిన అధికారులు.. వేదాశీర్వచనం చేసి అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం అందించారు వేదపండితులు.. దుర్గమ్మను దర్శించుకున్నవారిలో ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. బెజవాడ ఎంపీ కేశినేని చిన్ని సహా పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పి.. రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఇప్పటికే రాజీనామా చేసిన సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు.. ఈ రోజు టీడీపీ గూటికి చేరనున్నారు.. సాయంత్రం 6 గంటలకు ఉండవల్లిలోని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ఆయన సమక్షంలో.. టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.. ఇక, ఈ ఇద్దరు మాజీ ఎంపీల వెంట పెద్ద సంఖ్యలో అనుచరులు కూడా టీడీపీ కండువాకప్పుకుంటారని తెలుస్తోంది..