Parawada Pharma City: అనకపల్లి జిల్లా పరవాడ జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఠాగూర్ ఫార్మా కంపెనీలో నిన్న అర్థరాత్రి విషవాయులు లీకయ్యాయి.. కంపెనీలో పనిచేస్తున్న 9 మంది కార్మికులు అస్వస్థకు గురైయ్యారు.. ప్రమాదం జరిగిన విషయాన్ని బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు కంపెనీ యాజమాన్యం.. గుట్టు చప్పుడు కాకుండా షీలనగర్ లోని కిమ్స్ ఐకాన్ హాస్పటల్ కి క్షతగాత్రులను తరలించింది యాజమాన్యం.. వీరిలో ఇద్దరు పరిస్థితి విసమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం వివరాలు చెప్పడానికి నిరాకరిస్తున్నరు ఠాగూర్ కంపెనీ యాజమాన్యం. ఇక, ఈ ఘటనలో ఒడిశాకు చెందిన ఒక వ్యక్తి మృతి చెందారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: Pushpa -2 : దేవిశ్రీ ప్రసాద్ వివాదంపై మైత్రీ నిర్మాతల రియాక్షన్
మరో వైపు అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో జరిగిన ప్రమాదంపై ఆరా తీశారు సీఎం చంద్రబాబు నాయుడు.. బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.. బాధితులకు ప్రభుత్వ పరంగా అండగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. అయితే, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లీక్ అయిన ఘటనలో ఒకరు చనిపోగా, ఇద్దరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారని… వారిని క్రిటికల్ కేర్ సెంటర్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు సీఎం చంద్రబాబుకు తెలిపారు అధికారులు.. మరోవైపు. విషవాయువు లీక్ అయిన ఘటనపై హోంమంత్రి సీరియస్ అయ్యారు.. గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు ఆదేశాలిచ్చినా కంపెనీల నిర్లక్ష్యవైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతిచెందడంపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హోంమంత్రి, విష వాయువు పీల్చి అస్వస్థతకు గురైన బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించాలని కిమ్స్ ఆస్పత్రి వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు..జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ తో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నరు హోంమంత్రి అనిత.. ప్రమాదానికి కారణమైన వారిపై, యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిపై దర్యాప్తు అనంతరం కఠిన చర్యలుంటాయన్నారు హోంమంత్రి.
Read Also: Peanut Allergy: “పల్లీలు” యువతి ప్రాణం తీశాయి.. డేట్ కోసం వెళ్లి అనూహ్యంగా మృతి..
ఇక, అనకాపల్లి జిల్లా పరవాడలో ఠాగూర్ ఫార్మా కంపెనీలో ప్రమాదంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. విషవాయువు లీకై, ఒక కార్మికుడు చనిపోగా, 8 మంది అస్వస్థతకు గురైన ఘటనపై వైయస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అస్వస్ధతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించడంతో పాటు, ఘటనలో మృతి చెందిన కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.