పాలనపై మరింత ఫోకస్ పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు. అయితే అదేసమయంలో.. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు. కొందరు మంత్రుల తీరుపై ఇప్పటికే పలుదపాలుగా సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలతో సమన్వయం ఉండాలని ఇంచార్జి మంత్రులకు పదేపదే చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు.
శ్రీవారి వార్షిక రథసప్తమి వేడుకలతో తిరుమల శోభాయమానంగా మారింది. ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పేర్కోనే రథసప్తమి పర్వదినం రోజున శ్రీవారు ఏడు వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులుకు దర్శనమిస్తారు.
జమ్మలమడుగు పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ హాట్‌గానే ఉంటాయి. ఏదో ఒక సంచలనానికి కేంద్ర బిందువుగా మారుతుంటాయి. ఇప్పుడిక్కడ ఒకే పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు ఢీ అంటే ఢీ అంటుండటం కాక రేపుతోంది. ఒకరిది ఇప్పుడు కాకున్నా... గతంలో ఫ్యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఉన్న ఫ్యామిలీ. మరొక నాయకుడిది వ్యాపార కుటుంబం. జమ్మల మడుగు ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణరెడ్డి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ చేస్తున్న రాజకీయం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో కొత్త సమీకరణలకు దారి తీస్తోందని…
కర్నూలు జిల్లా మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తీరు ఆ పార్టీలో చర్చనీయాంశం అవుతోంది. ఒకప్పుడు జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ... ఇప్పుడు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలకే పరిమితమైంది. ఆలూరులో విరూపాక్షి, మంత్రాలయం నుంచి బాలనాగి రెడ్డి మాత్రమే గెలిచారు.
ఎన్డీఏపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు సీపీఎం సీనియర్ నేత బృందాకారత్.. నెల్లూరులో సీపీఎం రాష్ట్ర మహాసభల ముగింపు సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. నెల్లూరు నుంచి పుచ్చలపల్లి సుందరయ్య పార్టీ కోసం పని చేశారు.. పార్టీ కోసం ఎంతో కష్ట పడిన సీతారాం ఏచూరిని కోల్పోయాం.. నెల్లూరులో పార్టీకి చెందిన వైద్యులు ఏర్పాటు చేసిన ఆసుపత్రి కి వచ్చాను.. నెల్లూరులో ఎన్నో పోరాటాలు జరిగాయని గుర్తుచేశారు.. అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను…
ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీలో అమ్మ్ ఆద్మీ పార్టీ పనితీరును ఆదర్శంగా తీసుకుని పని చేయాలని పిలుపునివ్వడం ఆశ్చర్యానికి గుర్తు చేసింది. రాజమండ్రిలో జరిగిన తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సమాయత్తా సమావేశంలో పేరాబత్తుల రాజశేఖర్ వ్యాఖ్యలు వివాదంగా మారాయి.
రైల్వే బడ్జెట్.. ఏపీకి భారీగా పెరిగిన నిధుల కేటాయింపు.. ఈ బడ్జెట్ లో ఏపీకి రూ. 9,417 కోట్ల విలువైన ప్రాజెక్టులు కేటాయింపులు జరిగాయని తెలిపారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్.. ఈ బడ్జెట్ లో యూపీఏ హయాంలో కంటే ఏపీకి 11 రెట్లు అధికంగా నిధులు కేటాయించామన్నారు.. ఏపీలో మొత్తం అమలవుతోన్న రైల్వే ప్రాజెక్టులు రూ. 84,559 కోట్ల వరకు కేటాయించామన్నారు.. కొత్త ప్రాజెక్టులు ఓ పద్ధతిలో, శాస్త్రీయమైన రీతిలో కేటాయింపులు జరుగుతున్నాయి. కొత్త…
కుంభమేళా ప్రభావంతో కోనసీమ కురిడి కొబ్బరి కి అనుకోని డిమాండ్ వచ్చింది... ప్రయాగ్ రాజ్ కి కోనసీమ నుంచి కొబ్బరి ఎగుమతులు జరుగుతున్నాయి.. అయితే, కొబ్బరి అంటే ముందుగా గుర్తొచ్చేది కోనసీమ.. వేల ఎకరాల్లో కొబ్బరి సాగు జరుగుతుంది.. కొబ్బరికాయలో నీళ్లు ఉంటే దానిని పచ్చి కొబ్బరి అంటారు..