ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అల్లుడు నరసింహం చిక్కుల్లో పడ్డారు. ఆయనపై పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ కేసు నమోదైంది. రాజమండ్రికి చెందిన గద్దె జయరామకృష్ణ, శ్రీవాణి దంపతుల ఆస్తులను ఫోర్జరీ సంతకాలతో బ్యాంకులో తాకట్టు పెట్టి నరసింహం లోన్ తీసుకున్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. 2018-19లో కొందరు బ్యాంకు సిబ్బంది సహకారంతో నరసింహం ఈ ఫ్రాడ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. Read Also: రూపాయి పంపి రూ.99వేలు పోగొట్టుకున్నాడు కాగా సోము…
ఏపీ ప్రభుత్వంపై మాజీ సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. మంగళగిరిలో పార్టీ నేతలతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన మాట్లాడుతూ… వైసీపీకి ప్రజలు నమ్మకంతో ఓటేస్తే.. జగన్ ఆ నమ్మకాన్ని ఒమ్ము చేశారని ఆరోపించారు. మద్య నిషేధం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. న్యూఇయర్ రోజు ఒక్కరోజే రూ.124 కోట్ల అమ్మకాలు చేశారంటే మద్య నిషేధం ఎలా చేస్తారని ప్రజలను నమ్మమంటారని నిలదీశారు. సొంత మద్యం బ్రాండ్లతో అంతా దోచుకుని ఇప్పుడు…
ఏపీలో సినిమా టిక్కెట్ రేట్ల అంశం హాట్‌టాపిక్‌గా నడుస్తోంది. ఇప్పటికే దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఏపీ ప్రభుత్వంపై ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా జనసేన పార్టీ సమావేశంలోనూ ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ సినిమా టిక్కెట్ల విషయాన్నే ప్రస్తావించారు. ఏపీలో సినిమా టిక్కెట్ల అంశం తప్ప సీఎం జగన్‌కు ఇంకేం తెలియదా అంటూ ప్రశ్నించారు. జగన్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సిమెంట్ రేట్లు, ఇసుక రేట్లను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. Read Also: రూపాయి…
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వైరస్‌ను గుర్తించడానికి సాంకేతిక విధానం అవసరం. ఇప్పటివరకు ఇలాంటి విధానం కలిగి ఉన్న ల్యాబ్‌లు దేశంలో పుణె, హైదరాబాద్ నగరాల్లోనే అందుబాటులో ఉన్నాయి. కొంచెం ఆలస్యంగా అయినా తాజాగా ఈ ల్యాబ్ ఏపీలో కూడా ఏర్పాటు కావడం విశేషం. విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీ ప్రాంగణంలో జీనోమ్ సీక్వెన్సింగ్ కేంద్రం అందుబాటులోకి వచ్చింది. Read Also: రూపాయి పంపి రూ.99వేలు పోగొట్టుకున్నాడు హైదరాబాద్‌లోని సీసీఎంబీ ఆధ్వర్యంలో…
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో ఏపీ సీఎం వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. దాదాపు గంటసేపు కేంద్ర మంత్రితో సమావేశం అయ్యారు. రాష్ట్రానికి పలు జాతీయ రహదారులను మంజూరు చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకు ఏర్పాటు చేయాలనుకున్న జాతీయ రహదారికి సంబంధించిన డీపీఆర్ తయారీ అంశంపై చర్చించారు. విశాఖపట్నానికి ఈ రహదారి చాలా ఉపయోగమని, ఈ రహదారి నిర్మాణం ద్వారా విశాఖ పోర్టు నుంచి ఒడిశా, ఛత్తీస్గడ్…
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కొత్త పార్టీ పెడుతున్నారని ఇటీవల తీవ్రస్థాయిఓ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎస్సీ, బీసీ, కాపు కులాలకు ముద్రగడ రాసిన లేఖ కొత్త పార్టీ ఏర్పాటుపై సంకేతాలు పంపింది. ఏపీలో తక్కువ జనాభా కలిగిన వర్గాల వారు అధికారం అనుభవిస్తున్నారని… ఎక్కువ జనాభా కలిగిన మన జాతులు ఎందుకు అనుభవించకూడదో ఆలోచన చేయాలని లేఖలో ముద్రగడ ప్రస్తావించారు. ఎప్పుడూ పల్లకి మోయడం కాదని.. మనం పల్లకిలో కూర్చునేలా…
ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ ఘనవిజయం సాధిస్తుందని… జగన్ మళ్లీ సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ జగన్ మళ్లీ సీఎం కాకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ధర్మాన స్పష్టం చేశారు. శ్రీకాకుళంలో డ్వాక్రా బజార్ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ… వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయంటూ టీడీపీ నేతలు ప్రచారం చేస్తుండటంపై మండిపడ్డారు. టీడీపీ నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ధర్మాన ఆగ్రహం…
నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో కరోనా కలకలం రేగింది. శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఇద్దరు వైద్యులకు, 12 మంది ఉద్యోగులకు కరోనా సోకింది. కరోనా సోకిన వారి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌కు పంపించారు. మొత్తం 14 మందికి కరోనా సోకడంతో అంతరిక్షకేంద్రంలో పనిచేస్తున్న మిగతా ఉద్యోగులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనికోసం ప్రత్యేక మార్గదర్శకాలను షార్ అధికారులు విడుదల చేశారు. బయో మెట్రిక్ స్థానంలో అటెండెన్స్ రిజిస్టర్లను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు, వైద్యులకు కరోనా సోకడంతో…
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్ బిజీబిజీగా ఉన్నారు. సోమవారం నాడు ప్రధాని మోదీ, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమైన సీఎం జగన్… మంగళవారం నాడు పలువురు కేంద్రమంత్రులను కలవనున్నారు. ఉదయం 9:30 గంటలకు కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఏపీ సీఎం జగన్ భేటీకానున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్‌తో జగన్ సమావేశం కానున్నారు. Read Also: బీ అలర్ట్… దేశంలో కరోనా థర్డ్ వేవ్…
తిరుమలలో నకిలీ దర్శన టిక్కెట్లను విక్రయిస్తున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కృష్ణారావు, స్కానింగ్ ఆపరేటర్ నరేంద్ర, లడ్డూ కౌంటర్ ఉద్యోగి అరుణ్ రాజు, ట్రావెల్ ఏజెంట్ బాలాజీ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరు మధ్యప్రదశ్‌కు చెందిన ముగ్గురు భక్తులకు నకిలీ దర్శన టిక్కెట్లు విక్రయించారు. మూడు రూ.300 దర్శనం టిక్కెట్లను రూ.21వేలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. Read Also: గుడ్ న్యూస్… ఒమిక్రాన్ చికిత్సకు…