Sajjala Ramakrishna Reddy comments on polavaram Height:పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని సజ్జల గుర్తుచేశారు. పోలవరం ఎత్తుపై తెలంగాణ వాదన అసంబద్ధంగా ఉందన్నారు. భద్రాచలానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని ప్రత్యేక ఏజెన్సీలు ఇచ్చిన నివేదికల ఆధారంగానే డిజైన్లు ఖరారు చేశారని సజ్జల తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ…
Srisailam Project gates will open on july 21st: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయం గేట్లు తెరిచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎల్లుండి (జూలై 21) శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేయనున్నారు. కృష్ణా, తుంగభద్ర నదులకు వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో శ్రీశైలం జలాశయంలో ఎల్లుండికి పూర్తి స్థాయి నీటి మట్టంకు నీరు చేరుకోనున్నాయి. శ్రీశైలం జలాశయంకు వరద నీటి…
Minister Ambati Rambabu comments on polavaram project height: తెలుగు రాష్ట్రాల మధ్య పోలవరం ప్రాజెక్టుపై వివాదం చెలరేగింది. గోదావరి వరదలకు భద్రాచలం మునిగిపోవడంతో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పోలవరం ఎత్తుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విలీన మండలాలను ఏపీలో కలపడాన్ని తప్పుబట్టారు. దీంతో మంత్రి పువ్వాడ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం స్పందిస్తోంది. తాజాగా మంత్రి అంబటి రాంబాబు కూడా స్పందించారు. పోలవరంపై తెలంగాణ నేతల వ్యాఖ్యలు సరికాదన్నారు. బాధ్యతాయుత పదవిలో ఉన్నవాళ్లు…
Hindupuram YSRCP Conflicts: ఏపీలో అధికార పార్టీ వైసీపీలో మరోసారి వర్గపోరు బయటపడింది. హిందూపురంలో ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు నెలకొన్నాయి. 2014 ఎన్నికల్లో హిందూపురంలో పోటీ చేసిన నవీన్ నిశ్చల్, ఎమ్మెల్సీ షేక్ మహ్మద్ ఇక్బాల్ వర్గాల మధ్య కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఇటీవల హిందూపురం ప్రెస్ క్లబ్ వేదికగా రెండు వర్గాల నేతలు రాళ్ల దాడులు చేసుకున్నారు. ఈ వ్యవహారం తాజాగా వైసీపీ పెద్దల వద్దకు చేరింది. మంగళవారం నాడు హిందూపురం వైసీపీ…
Andhra Pradesh: కొవిడ్-19 బూస్టర్ డోస్ టీకా విషయంలో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఏపీలో ఇప్పటికే సుమారు 59 లక్షల మంది ఈ మూడో డోస్ వేయించుకున్నారు. దేశం మొత్తమ్మీద ఏ రాష్ట్రంలోనూ లేదా ఏ కేంద్ర పాలిత ప్రాంతంలోనూ ఇంత తక్కువ వ్యవధిలో ఇంత ఎక్కువ మంది బూస్టర్ డోస్ తీసుకోలేదు.
Botsa Satyanarayana comments on polavaram project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో పువ్వాడ అజయ్ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. పోలవరం ఎత్తు ఎవరు పెంచారని పువ్వాడ అజయ్‌ను ప్రశ్నించారు. డిజైన్ల ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందని.. దాన్ని ఎవరూ మార్చలేదన్నారు. భద్రాచలం ముంపు ఉంటుందని ఉమ్మడి రాష్ట్రంలో ప్రస్తావించారని గుర్తుచేశారు. విభజన చట్ట…
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్ఐఏ సోదాలు కలకలం సృష్టించాయి.. ఏకకాలంలో ప్రకాశం జిల్లా, విజయవాడ, నెల్లూరులో ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. మావోయిస్టులకు నిధులు అందిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఎన్ఐఏ అధికారులు ఏకకాలంలో నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.. ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, విజయవాడలోని రెండు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీష, విరసం నేత కల్యాణ్ రావు ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించారు.. శిరీష ఇంట్లో లేకపోవడంతో తాళం పగలగొట్టి మరీ సోదాలు చేపట్టడంపై ప్రజాసంఘాలు…
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోయినా.. ఓట్లు, సీట్ల గురించి సవాళ్లు, ప్రతి సవాళ్లు వినిపిస్తున్నాయి.. గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే.. ఈ సారి ఎక్కువగా వస్తాయని.. రాష్ట్రంలోని 175 స్థానాలకు 175 తామే గెలుస్తామని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు చెబుతున్నమాట.. అయితే.. రానున్న ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 175 కాదు కదా.. 17 సీట్లు కూడా రావు అని జోస్యం చెప్పారు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహంతోనే హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పల్నాడు జిల్లా, రొంపిచర్ల మండల తెలుగుదేశం అధ్యక్షుడు వెన్నా బాల కోటిరెడ్డిపై అలవల గ్రామంలో జరిగిన దాడి ఘటనను సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఖండించిన ఆయన.. ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లిన వ్యక్తిపై గొడ్డళ్ళతో దాడి చేశారంటే ఏపీలో శాంతి భద్రతల రక్షణ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? నిద్రపోతున్నాయా? అని ప్రశ్నించారు.. తెలుగుదేశం కార్యకర్తలు, నేతల హత్యలకు జగన్ ప్రోత్సాహం ఉంది కాబట్టే.. వైసీపీ నేతలు…