KVP: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, దివంగత సీఎం వైఎస్ఆర్ ప్రాణమిత్రుడు కేవీపీ రామచంద్రరావు ‘పోలవరం-ఓ సాహసి ప్రయాణం’ పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సదరు పుస్తకంలో కేవీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీకి జీవనాడిగా మారిన పోలవరం ప్రాజెక్టుకు ఎదురైన అడ్డంకుల గురించి అందులో కూలంకుషంగా చర్చించారు. డెల్టా ప్రాంతాలకు, రాయలసీమలో దుర్భిక్ష పరిస్థితులకు నీటిలభ్యత లేకపోవడమే కారణమని ఆనాడు వైఎస్ఆర్ ఆలోచించారని.. అందుకే ఏపీలో సాగు నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. శ్రీకాకుళంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదలకు ఇచ్చే ఇళ్లకు జగనన్న ఇల్లు అనే పేరు పెట్టుకోవటానికి వీలు లేదన్నారు.. ప్రధానిమంత్రి ఆవాస్ యోజన అని పేరు పెట్టకపోతే జగనన్న కాలనీలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తా.. కేంద్రం నిధులు నిలిపేస్తామని హెచ్చరించారు.. ఇక, రాష్ట్రంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న స్పీకర్, మంత్రులు అర్ధరహితమైన భాష మాట్లాడుతున్నారని మండిపడ్డ ఆయన..…
ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు, ప్రజల తరుపున ఎవరు నిలబడ్డారో ప్రజలకు తెలుసు అని వ్యాఖ్యానించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. మూడు రాజధానులపై హాట్ హాట్‌గా చర్చ సాగుతోన్న సమయంలో.. ఓవైపు మూడు రాజధానులు.. మరోవైపు అమరావతి రాజధాని డిమాండ్ గట్టిగా వినిపిస్తున్న సమయంలో ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.. శ్రీకాకుళం జిల్లాలో ఆర్టీసీ అద్దె బస్సులను ప్రారంభించిన మంత్రి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్టీసి ప్రయాణం సుఖం , సురక్షితం అన్నారు.. ఆర్టీసీ బస్సులను వాడుకొనపొవడమే ప్రమాదాలకు…
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రాజధానిగా అమరావతి వైఎస్ జగన్ సమర్ధించలేదన్నారు.. మూడు రాజధానులపై సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన నిర్వహించారు.. ర్యాలీ ప్రారంభానికి ముందు భూమనపై పూల వర్షం కురిపించారు.. మూడు రాజధానులు, రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ గుండె చప్పుడు వినిపిస్తూ మహా ప్రదర్శన జరిగింది.. స్థానిక కృష్ణాపురం ఠాణా…
విద్యార్థినులపై లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి.. ఉన్న ప్రాంతంలో చుట్టుపక్కలవారితో ఆడపిల్లలకు రక్షణ అనుమానంగా మారిపోయింది.. ఎక్కడికైనా వెళ్లాలన్నా.. ఎక్క ఏ కామాంధుడు ఉన్నాడో తెలియని పరిస్థితి.. తీరా చదువుకునే ప్రాంతంలోనూ వేధింపులు తప్పడంలేదు.. తాజాగా, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నిట్‌లో కీచకపర్వం వెలుగుచూసింది. బయోటెక్నాలజీ లెక్చరర్ తమిళమణి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని… విద్యార్థినులు ఆందోళనకు దిగారు. కాలేజీ అడ్మినిస్ట్రేషన్ భవనం దగ్గర ధర్నా చేశారు. లెక్చరర్‌ను విధుల నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. దీంతో క్యాంపస్‌లో కాసేపు…
కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమోటా ధర దారుణంగా పడిపోయింది.. దీంతో. లబోదిబోమంటున్నారు రైతులు. అధిక వర్షాల వల్ల టమోటా బాగా దెబ్బతినడంతో రైతులు బాగా నష్టపోతున్నారు.. ఉన్న కాస్త పంట కూడా చేతికి వచ్చి మార్కెట్ కి తీసుకెళ్తే.. కిలో 4 రూపాయలు కూడా ధర లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మద్దికేర ఆస్పరి దేవనకొండ మండలాల నుండి టమోటాను మార్కెట్ కు తరలిస్తుంటారు రైతులు.. రెండు రోజుల నుండి…
కాంగ్రెస్ పార్టీ అధ్యాయం ముగిసింది.. 2024లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు... 2024లో తిరిగి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి.
టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న నిరాహార దీక్షను భగ్నం చేశారు పోలీసులు.. ఉత్తరాంధ్ర ప్రజా సమస్యలపై పోరాటం కోసమంటూ బుద్దా వెంకన్న బయలుదేరగా.. పోలీసులను ఆయన్ని అడ్డుకున్న విషయం తెలిసిందే.. దానికి నిరసనగా నిరాహార దీక్ష చేపట్టారు వెంకన్న.. ఉత్తరాంధ్రలో టీడీపీ నాయకులు పోరాడితే వైసీపీ నేతల దోపిడి బయటపడుతుంది అనే భయంతో.. ఇలా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.. అయితే, తన నివాసంలోనే నిరాహార దీక్షకు దిగిన బుద్దా వెంకన్నను అర్ధరాత్రి ఆస్పత్రికి తరలించారు పోలీసులు..…
నేడు తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీకి సిద్ధమైంది.. ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో నగరంలో రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన నిర్వహించనున్నారు.. ఇప్పటికే తిరుపతికి చేరుకుంటున్నారు రాయలసీమ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువత…. మూడు రాజధానులు/రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ గుండె చప్పుడు వినిపిస్తూ మహా ప్రదర్శన.. ఆ తర్వాత బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి.. స్థానిక కృష్ణాపురం ఠాణా వద్ద నుంచి ప్రారంభం కానున్న మహా…
Andhra Pradesh: ఏపీలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో భారీగా పీజీ సీట్లు పెరగనున్నాయి. 2019 వరకు రాష్ట్రంలో మెడికల్ పీజీ సీట్ల సంఖ్య 970గా ఉండగా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న చర్యల కారణంగా 2022లో మరో 207 సీట్లు పెరిగాయి. ఇప్పుడు అదనంగా 746 సీట్లకు దరఖాస్తు చేసేందుకు అవకాశం వచ్చిందని అంటున్నారు. ఈ ఏడాదిలో ఈ సీట్ల పెరుగుదల దాదాపు ఖరారైంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 2019 వరకు మొత్తంగా రాష్ట్రంలో…