Petrol Prices: దేశవ్యాప్తంగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. పెట్రోల్, డీజిల్పై చెరో 40 పైసలు తగ్గనున్నట్లు సోమవారం నాడు కేంద్రం ప్రకటించింది. దీంతో దేశంలో మరోసారి ఇంధన ధరలు తగ్గుముఖం పట్టనున్నాయి. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో లీటర్ పెట్రోల్ రూ.109.64, డీజిల్ రూ.97.8గా ఉంది. ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.67, డీజిల్ ధర రూ.99.40గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో…
తిరుపతిలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు.. దంపతుల కళ్లలో కారం కొట్టి.. ఆ పై కత్తితో దాడికి దిగారు.. పుంగనూరు మండల పరిధిలో చోటుచేసుకుంది ఈ ఘటన… మృతుని భార్య అనురాధ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. మండలంలోని నెక్కుంది గ్రామానికి చెందిన రెడ్డప్ప కుమారుడు దాము 25 తన భార్య 23 అనురాధతో కలిసి అత్తగారింటికి వెళ్లి తిరిగి ప్రయాణం అయ్యారు.. సాయంత్రం ఏడు గంటల సమయంలో తుర్లపల్లి గ్రామ సమీపాన ఉన్న దొనబండ ప్రాంతానికి…
ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి.. ఇక, కలియుగ ప్రత్యక్షదైవం తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతూ వస్తోంది.. భక్తుల తాకిడితో పాటు శ్రీవారి హుండీ ఆదాయం కూడా ఏ మాత్రం తగ్గడం లేదు.. కరోనా సమయంలో పడిపోయిన హుండీ ఆదాయం ఆ తర్వాత ఏ నెల తీసుకున్నా రూ.100 కోట్ల మార్క్ కంటే తక్కువగా వచ్చిందే లేదు.. ఇవాళ శ్రీవారి హుండి ఆదాయం 4.18 కోట్లు రాగా… వరుసగా…
కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సీఎం జగన్ కు లేఖ రాశారు కన్నా లక్ష్మీనారాయణ.. 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాలో 5 శాతం కాపులకు కేటాయించాలని లేఖలో కోరారు.
Gudivada Amarnath: విశాఖలో రాండ్ స్టాడ్ రిక్రూట్మెంట్ కంపెనీని ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ సోమవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాండ్ స్టాడ్ లాంటి గ్లోబల్ ఎక్స్పోజర్ ఉన్న కంపెనీలు విశాఖ వైపు చూస్తున్నాయంటే భవిష్యత్ను అర్ధం చేసుకోవచ్చన్నారు. విశాఖ ముఖ చిత్రాన్ని మార్చే విధంగా ప్రఖ్యాత సంస్థలన్నీ విశాఖకు తరలివస్తుండటం సానుకూల సంకేతమని మంత్రి అమర్నాథ్ అన్నారు. జనవరి నుంచి ఇన్ఫోసిస్ కంపెనీ కార్యకలాపాల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు…
విజయవాడలో ఏడాది క్రితం జరిగిన బిల్డర్ హత్య కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది... విజయవాడ శివార్లలోని 61వ డివిజన్ పాయకాపురం దేవినేని గాంధీపురంలో హత్యకు గురైన బిల్డర్ పీతల అప్పలరాజు హత్య మిస్టరీని పోలీసులు చేధించారు.
Andhra Pradesh: ఏపీలో జగన్ ప్రభుత్వం మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు ప్రజల నుంచి డైరెక్ట్ ఫీడ్ బ్యాక్ కోసం ‘జగనన్నకు చెబుదాం’ పేరుతో కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు జగన్ సర్కారు కసరత్తు చేస్తోంది. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం విధివిధానాలపై సీఎం జగన్ పార్టీ ముఖ్య నేతలతో సోమవారం నాడు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం…