Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్ ఏర్పాటు చేస్తూ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు రాజధాని పరిధిలోని ఐదు గ్రామాలలో 900.97 ఎకరాలను కేటాయించింది. మంగళగిరి మండలంలోని కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు.. తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల్లో ఆర్-5 జోనింగ్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అభ్యంతరాలు,…
వివిధ రోగాలతో ఇబ్బంది పడుతున్నవారికి శుభవార్త చెప్పారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి… వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ఆయన.. ఆరోగ్యశ్రీలో వైద్య చికిత్సల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాదు.. వాటిని వెంటనే ప్రారంభించారు.. ఆరోగ్య శ్రీ కింద వైద్య చికిత్సల సంఖ్యను ఇప్పుడు 3,255కి పెంచుతూ నిర్ణయం తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్.. కొత్తగా 809 వైద్య చికిత్సలను ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చారు.. మే 2019లో ఆరోగ్య శ్రీకింద వైద్య చికిత్సల…
నవంబర్ 1వ తేదీ నుంచి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.. తిరుమలలో మీడియాతో మాట్లాడిన ఆయన.. 1వ తేదీ నుంచి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీని ప్రారంభిస్తాం.. తిరుపతిలోని భూదేవి, శ్రీనివాసం, గోవిందరాజ సత్రాల్లో టోకెన్లను జారీ చేస్తామని పేర్కొన్నారు.. ఏ రోజూ టోకెన్ల కోటాను ఆ రోజుకి మాత్రమే జారీ చేస్తాం.. సోమవారం, బుధవారం, శని, ఆదివారాల్లో 20 వేల నుంచి 25…
మూడు రాజధానులపై ముందుకు వెళ్తున్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ… ప్రజల నుంచి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు సాగిస్తోంది.. ఇప్పటికే ఉత్తరాంధ్ర ప్రజలతో విశాఖ గర్జన జరగగా.. ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలోనూ ఉ్యమానికి శ్రీకారం చుట్టింది… తిరుపతి వేదికగా మహా ప్రదర్శన నిర్వహించేందుకు సిద్ధం అయ్యింది.. ఈ సందర్భంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన ఫ్లెక్సీలు ఆవిష్కరించారు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి.. ఇప్పుడు కాకపోతే…
తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. అలిపిరి వద్ద టీటీడీ ఉద్యోగుల ద్విచక్ర వాహనాల పార్కింగ్ కోసం రూ. 54 లక్షలతో నిర్మించిన పార్కింగ్ షెడ్‌ను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తిరుమలలో పనిచేసే ఉద్యోగులకు ఎలక్ట్రికల్ బైక్‌లపై రాయితీ అందిస్తామని వెల్లడించారు.. ఇక, టీటీడీకి 100 ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలు దాతలు అందించారని తెలిపిన ఆయన.. నవంబర్ 1వ తేదీ నుంచి సర్వదర్శనం, ఎస్.ఎస్.డి టోకెన్…
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారంపై చర్చ సాగుతూనే ఉంది.. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంటే.. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు.. ఇక, ఇప్పటికే రాజధానిపై తన వైఖరిని స్పష్టం చేసింది భారతీయ జనతా పార్టీ.. అమరావతి రాజధానికి తాము కట్టుబడి ఉన్నామని తేల్చేసింది.. మరోసారి ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. సీఎం వైఎస్ జగన్‌పై ఘాటు వ్యాఖ్యలుచేశారు.. సీఎం వైఎస్…
Nadendla Manohar: వైసీపీ ప్రభుత్వంపై జనసేన నేత, పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మరోసారి విమర్శలు చేశారు. పేదల ఇళ్ల నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. మూడున్నరేళ్లలో నిర్మించిన ఇళ్లు కేవలం 8 శాతమేనని.. పీఎంఏవై ఇళ్లు కేవలం 5 శాతం మాత్రమే నిర్మించారని నాదెండ్ల మనోహర్ విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణం కోసం ఇచ్చిన నిధుల నుంచి రూ.1,547 కోట్లు పక్కకు మళ్లించారన్నారు. సమీక్షల్లో వాస్తవాలను తొక్కిపెడుతున్నారని.. నవరత్నాలు –…
R Krishnnaiah: విజయవాడలో జరిగిన బీసీల ఆత్మగౌరవ సభలో వైసీపీ రాజ్యసభ ఎంపీ ఆర్.కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. అనేక రాష్ట్రాలలో ఎన్నో సంవత్సరాల పాటు బీసీలు ముఖ్యమంత్రులుగా పనిచేశారని.. కానీ ఏ ఒక్కరూ బీసీలకు పూర్తిగా న్యాయం చేయలేకపోయారని ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. కానీ ఏపీ సీఎం జగన్ బీసీ కాకపోయినా బీసీల పక్షపాతిగా నిలిచారని ప్రశంసలు కురిపించారు. అందుకే సీఎం జగన్‌ను సంఘ సంస్కర్తగా పరిగణించాలని ఆర్.కృష్ణయ్య సూచించారు. కులాల ఆత్మగౌరవాన్ని గుర్తించిన నాయకుడు వైఎస్…
YSRCP: ఆంధ్రప్రదేశ్ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అనూహ్యంగా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరారు. కొంతకాలంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మోకాలి నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆస్పత్రిలో చేరి వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. గురువారం ఈ ఆపరేషన్ విజయవంతం అయినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు మంత్రి సురేష్ వీల్ ఛైర్లో ఉన్న ఫోటోను వైద్యులు విడుదల చేయగా సోషల్ మీడియాలో అది వైరల్‌గా మారింది. Read…
High Court: తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ ఆరో సీజన్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ షో మధ్యలోనే ఆగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. బిగ్‌బాస్ షోలో అశ్లీలత ఎక్కువగా ఉందని, ఫ్యామిలీతో కలిసి ఈ షోను చూసే పరిస్థితి లేదని ఆరోపిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నాగార్జునతో…