సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. ఎలాగైనా.. ఎన్ని కష్టాలు భరించైనా సొంత ఊరికి వెళ్లాలని ప్రయత్నాలు చేస్తుంటారు తెలుగు ప్రజలు.. దీంతో, పండు సీజన్లో విమానాలు, రైళ్లు, బస్సులు.. ఇలా ఏవి ఆశ్రయించినా ప్రయాణికుల రద్దీ ఉంటుంది.. దీంతో, సొంత వాహనాల్లో కూడా ఊరికి వెళ్లేవారు ఉన్నారు.. అయితే, సంక్రాంతి పండుగకు మరో 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే… ఇప్పటికే సంక్రాంతి రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది…
నారా లోకేష్ పాదయాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం ఎన్ఆర్ పురం గ్రామంలో గడపగడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయ పరిజ్ఞానం లేని లోకేష్ నీకెందుకు ఈ పాదయాత్ర..? అని ప్రశ్నించారు.. ఎవరిని ఉద్ధరించడానికి చేస్తావ్ ఈ పాదయాత్ర..? అని నిలదీసిన ఆయన.. వార్డ్ మెంబర్‌గా కూడా గెలవలేని నువ్వు ముఖ్యమంత్రి అయిపోవాలని పగటి కలలు కంటున్నావు అంటూ…
ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్–1 పోస్టుల నియామకానికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్‌కు తేదీని ఖరారు చేసింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ)… స్క్రీనింగ్ టెస్ట్‌ను జనవరి 8వ తేదీన నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్. అరుణ్‌కుమార్ పేర్కొన్నారు.. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.. జనవరి 8వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక పేపర్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రెండో పేపర్…
Bhuma Akhila Priya: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ.. నంద్యాలలో మీడియాతో మాట్లాడిన ఆమె.. ఏపీలో బతకడం కన్నా పక్క రాష్ట్రాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతకోచ్చు అనే స్థాయికి ప్రభుత్వం తీసుకొచ్చిందని ఆరోపణలు గుప్పించారు.. వైసీపీ నాయకులు ఎన్నో హామీలు ఇచ్చి మభ్యపెట్టి, అధికారంలోకి వచ్చారు.. తీరా, అధికారం వచ్చిన తర్వాత ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చిన వైఎస్…
మూడు రాజధానుల వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో కాక రేపుతూనే ఉంది.. మూడు రాజధానుల ఏర్పాటు వైపు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుండగా.. విపక్షాలు మాత్రం.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నాయి.. అయితే, ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బొంతలకోడూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు పేరుతో నిర్వహిస్తోన్న కార్యక్రమాలపై మండిపడ్డారు.. జన్మభూమి కార్యకర్తలు…
Exams Schedule: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నట్లు వారు ప్రకటించారు. సీబీఎస్ఈ తరహాలో రోజు విడిచి రోజు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్షల నిర్వహణ ఉంటుందన్నారు. అటు తెలంగాణలోనూ ఏప్రిల్ 3 నుంచే పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. Read Also: Rishab Pant…
CM Jagan: కందుకూరు టీడీపీ సభలో తొక్కిసలాట ఘటనపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగునాథునిపాలెం సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఫోటో షూట్ కోసం, డ్రోన్ షాట్ కోసమే కందుకూరు సభ అని మండిపడ్డారు. 8 మందిని చంపేశారు.. ఇంతకంటే ఘోరం ఉంటుందా అని ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల్లోనూ షూటింగ్ కోసం 29 మంది ప్రాణం తీశారని ఆరోపించారు. అప్పుడు కూడా ప్రజలు ఇదేం ఖర్మరా బాబు అనుకున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయం అంటే…
What’s Today: * నేడు యాదాద్రిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. నేడు యాదాద్రి ఆలయంలో సుప్రభాతం, ఆర్జిత సేవలు రద్దు.. మధ్యాహ్నం వరకు సాధారణ దర్శనాలు నిలిపివేత * నేడు ఉమ్మడి విశాఖ జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. నర్సీపట్నం నియోజకవర్గంలో రెండు భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన.. సుమారు వెయ్యి కోట్లతో మెడికల్ కాలేజ్, ఏలేరు-తాండవ ఎత్తిపోతల పథకాలు చేపట్టిన ప్రభుత్వం.. అనంతరం జోగునాథుని పాలెం బహిరంగ సభ * హైదరాబాద్: నకిలీ పాస్‌పోర్టు కేసులో…