TG Venkatesh: చంద్రబాబు, పవన్ భేటీపై, పొత్తులపై టీజీ వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు.. వైసీపీయే కారణం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TG Venkatesh: హైదరాబాద్‌లో టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమావేశం కావడంపై ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద రచ్చే జరుగుతోంది.. అధికార వైసీపీ నేతలు ఇద్దరు నేతలను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు.. ప్రజలు చనిపోతే పరామర్శించింది లేదు.. కానీ, 11 మంది మృతికి కారణమైన చంద్రబాబును పవన్ పరామర్శించడం ఏంటి? అంటూ ఫైర్ అవుతున్నారు.. అయితే, చంద్రబాబు-పవన్ కల్యాణ్ భేటీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత టీజీ వెంకటేష్.. ఆ ఇద్దరు నేతలు కలవడానికి వైసీపీ నేతలే కారణం అన్నారు.. రోజు దత్త పుత్రుడు అనే విమర్శలతో పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిశారన్న ఆయన.. పవన్‌కు ఒక్క సీటు రాదంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారని.. అదే ఒక్కసీటు రాని పవన్.. చంద్రబాబును కలిస్తే వైసీపీ నేతలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? అని నిలదీశారు.
Read Also: Mega Bonuses: ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. ఉద్యోగులకు ఒకేసారి నాలుగేళ్ల బోనస్..
Also Read
- AP High Court: బీసీలకు 34% రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం..
- Nandyala District: నంద్యాలలో ఘోర విషాదం.. కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతు
- AP Deputy CM Pawan Kalyan: ప్రజా సమస్యపై పవన్ కళ్యాణ్ ఫాస్ట్ యాక్షన్.. గంటల్లోనే రోడ్ల మంజూరు!
- Rama Nandana: "మొగుడిని బాత్రూమ్లో దాచేది".. యూట్యూబర్ రమానందన స్కామ్‌లో సంచలన నిజాలు..
ఇక, ఎన్నికల్లో పొత్తులు ఎవరితో అయినా సాధ్యమే… ఆరు నెలల ముందు మాత్రమే పొత్తులు ఖరారవుతాయని కీలక వ్యాఖ్యలు చేశారు టీజీ వెంకటేష్.. పొత్తులపై బీజేపీ అడిగితే తన అభిప్రాయాన్ని తెలియచేస్తానని తెలిపారు.. ముఖ్యమంత్రి పదవి కావాలనుకున్నప్పుడు బీజేపీ.. టీడీపీతో పొత్తు పెట్టుకోదు అని స్పష్టం చేశారు. అయితే, ఎవరితో అయినా కలసి పనిచేయాలనుకుంటే బీజేపీ నిర్ణయం వేరుగా ఉంటుందన్నారు.. వైసీపీకి ఎలాగూ ఎవరితోనూ పొత్తు ఉండే విధానం లేదని చెప్పుకొచ్చారు.. ఇక, తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు అంశంపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు బీజేపీ నేత టీజీ వెంకటేష్. కాగా, ఇటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీతో పాటు.. ఎన్నికల్లో పొత్తులపై టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!