Prabhas Fauj : ప్రభాస్ ఫౌజీ మూవీ షూటింగ్ కు వెళ్తున్న ప్రొడక్షన్ వాహనం కు యాక్సిడెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ‘. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ సినిమా సెట్స్‌కు వెళ్తుండగా ప్రొడక్షన్ కారుకు ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమా షూటింగ్ కోసం యూనిట్ సభ్యులు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నారు. కారు డివైడర్‌ను ఢీకొన్న వేగానికి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కు చెందిన ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఐదుగురు సభ్యులు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు వారిని పోలీసుల సహాయంతో వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరగడంతో చిత్ర యూనిట్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. హను రాఘవపూడి దర్శకత్వంలో పీరియాడిక్ వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Jailer 2 Telugu Trailer: 'జైలర్ 2' ట్రైలర్‌తో రజనీకాంత్ మాస్ తాండవం! అయినా కానీ..
- Hanuman Ansh: గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్!
- Morphing Controversy: జాన్వీ మార్ఫింగ్ వివాదం.. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరిన టాలీవుడ్ పెద్దలు!
- Ramayana: ‘రామాయణం’ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే?
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!