TVK : టీవీకే విజయకేతనం.. విజయ్ వెనుక అసలైన ‘చాణక్యుడు’ ఇతడే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించిన విజయ్ పార్టీ ‘తమిళగ వెట్రి కజగం’ (TVK) సాధించిన అసాధారణ విజయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దశాబ్దాల చరిత్ర కలిగిన డీఎంకే, అన్నా డీఎంకే వంటి పార్టీలను వెనక్కి నెట్టి అతిపెద్ద పార్టీగా అవతరించడం వెనుక ఒక యువ వ్యూహకర్త మేధస్సు దాగి ఉంది. అతడే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కపిల్ సాహూ.
గతంలో ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐప్యాక్ (I-PAC) సంస్థలో కీలక సభ్యుడిగా పనిచేసిన కపిల్ సాహూ రెండేళ్ల క్రితం 12 మంది కోర్ టీమ్ సభ్యులతో బయటకు వచ్చేసి సొంతంగా పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సంస్థను స్థాపించాడు. ఐప్యాక్ పాత వ్యూహాలు ప్రస్తుత రాజకీయ పరిణామాలకు సరిపోవట్లేదని భావించిన తన సొంత బృందంతో సరికొత్త ప్రయోగాలు ప్రారంభించారు. ఇప్పటి వరకు 9 రాష్ట్రాల్లో తన సేవలు అందించిన కపిల్ సాహూ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించి తన సత్తా చాటారు. 2024లో ప్రశాంత్ కిషోర్ టీవీకే నుంచి తప్పుకున్న తర్వాత కపిల్ సాహూ ఆ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాల బలాబలాలు, పార్టీ నిర్మాణం వంటి కీలక అంశాల్లో విజయ్‌కు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా విజయ్ ఎన్నికల ర్యాలీలు, సర్వేలు, డేటా అనాలిసిస్ మరియు డిజిటల్ మీడియా కమ్యూనికేషన్స్‌లో కపిల్ బృందం అనుసరించిన వ్యూహాలు అద్భుత ఫలితాలను ఇచ్చాయి.
Also Read
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
- Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
- Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
75 ఏళ్ల చరిత్ర కలిగిన డీఎంకే, 52 ఏళ్ల అన్నా డీఎంకే వంటి బలమైన పార్టీల ఓటు బ్యాంకును టీవీకే వైపు తిప్పడంలో కపిల్ సాహూ సక్సెస్ అయ్యారు. రెండేళ్ల క్రితం ప్రారంభించిన పార్టీ అతిపెద్ద రాజకీయ శక్తులను ఓడించి చరిత్ర సృష్టించడం వెనుక కపిల్ సాహూ వ్యూహరచన ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పొలిటికల్ కన్సల్టింగ్ డొమైన్‌లో కపిల్ సాహూ పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది.
తాజావార్తలు
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!