సామాజిక సాధికార బస్సు యాత్ర ఒక విప్లవం అని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. అణగారిన కుటుంబాలకు, కులాలకు అండగా నిలబడిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 సంవత్సరాలు అయిన సామాజిక సాధికారత ఒక మాట గా మాత్రమే ఉంది.
ఈనెల 15న విజయవాడలో జరుగనున్న ప్రజా రక్షణ భేరి సభ విజయవంతం కోసం సీపీఎం సన్నాహక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడు పార్టీల మధ్య అధిపత్య పోరు కొనసాగుతుంది అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ నెల 21 నుంచి కుల గణన ప్రారంభం అవుతుంది అని సమాచార శాఖ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి కుల గణన ప్రక్రియ పూర్తి అవుతుంది.. సచివాలయ వ్యవస్థ ఉండటం వల్ల సర్వే ప్రక్రియ తొందరగా పూర్తి అవుతుంది అని ఆయన పేర్కొన్నారు. క్యాబినెట్ నిర్ణయంతో బీసీ వర్గ వ్యక్తిగా చాలా ఆనందంగా ఉంది అని మంత్రి అన్నారు.
మరో సారి వైసీపీ గెలవాలి.. రాష్ట్రంలో సుభిక్ష పరిపాలన కొనసాగాలి అని ఆకాక్షించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి.. పల్నాడు పర్యటనలో ఉన్న ఆయన.. మంచి చేసిన ప్రభుత్వ పని తనాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు.. మాచర్ల నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రూ.890 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం.. ప్రభుత్వం నుండి నేరుగా లక్ష మందికి పైగా లబ్ధి పొందారని తెలిపారు.
సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది.. 38 అంశాల అజెండాతో సాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర పడింది..
Vizianagaram: వైద్యో నారాయణో హరి అన్నారు. అంటే ప్రాణాపాయ స్థితిలో కూడా రోగికి వైద్య సేవలు అందించి మనిషి ప్రాణాలను కాపాడతారు వైద్యులు. అందుకే వైద్యుడిని దేవునితో పోల్చారు. కానీ ప్రస్తుతం కొంత మంది డాక్టర్లు మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఊడి పోయింది అన్నట్లు.. జలుబు చేసి దవాఖానకు వెళ్లిన ప్రాణాలతో తిరిగి వాస్తవమన్న గ్యారెంటీ లేదంటున్నారు ప్రజలు. పైసా మే పరమాత్మ అన్నట్లు ఉంది కొందరు…