Sri Sathya Sai District: పెళ్లి అనేది జీవితం లో ఓ భాగం అంటారు. కానీ జీవితంలో భాగమైన వివాహం రెండు జీవితాలకు సంబంధించింది. నచ్చని డ్రెస్ వేసుకోవడానికి మనం ఇష్టపడం. అలాంటిది ఇష్టం లేని పెళ్లి చేసుకోవాలి అంటే చాల కష్టంగా ఉంటుంది. అయితే తల్లిదండ్రులు పిల్లలకు పెళ్లి చేయాలి అనుకోవంలో తప్పులేదు. కానీ ఇష్టం లేని పెళ్లి చెయ్యాలి అనుకుంటేనే జీవితాలు నాశనం అవుతాయి. కొన్ని సార్లు ప్రాణాలే పోతాయి. ఇప్పుడు ఈ మాట…
చంద్రబాబుకు అదనపు షరతులు విధించాలంటూ మరోసారి హైకోర్టును ఆశ్రయించింది ఏపీ సీఐడీ.. అయితే, సీఐడీకి హైకోర్టు షాకిచ్చింది.. చంద్రబాబుకు అదనపు షరతులు విధించాలంటూ సీఐడీ వేసిన పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్లో ఉన్న కేబినెట్ సమావేశ మందిరంలో ఈ సమావేశం కానుంది కేబినెట్.. పలు కీలక అంశాలకు ఆమోదం తెలపనుంది మంత్రివర్గ సమావేశం.. సుమారు 19 వేల కోట్ల రూపాయాల విలువైన పారిశ్రామిక పెట్టుబడులకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది.
చంద్రబాబు బయట ఉంటే ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ము జగనుకు లేదు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబును జైల్లో పెట్టి ఎన్నికలు వెళ్లాలని జగన్ భావిస్తున్నారు.. సీబీఐ, ఈడీలు తన అక్రమాలను విచారణ చేయడానికి ముందే అవే అంశాల్లో చంద్రబాబును బద్నాం చేద్దామని జగన్ కుట్ర పన్నారు.
నాలుగున్నరేళ్లలో ఇసుక బొక్కేసి రూ. 40 వేల కోట్లు దోచిన గజదొంగ ఎవరు జగన్ రెడ్డి? కదా అని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. ఇసుకను మీరు దోచేసి ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై అక్రమ కేసు సిగ్గనిపించటం లేదా?.
బాలినేని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. నేను పార్టీ మారే ప్రసక్తే లేదు.. పార్టీ మారే ఉద్దేశ్యం ఉంటే ఇక్కడికి రాను అని తెలిపారు. నాలుగేళ్ల మంత్రి పదవి వదులుకుని జగన్ కోసం వచ్చిన వాడిని.. ముఖ్యమంత్రి దగ్గరకు రావటానికి నాకు అపాయింట్మెంట్ అవసరం లేదు అని ఆయన పేర్కొన్నారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిపై మరో కేసు నమోదైంది. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఏపీఎమ్డీసీ ఇచ్చిన ఫిర్యాదుతో ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏ-1గా పీతల సుజాత, ఏ-2గా చంద్రబాబు, ఏ-3గా చింతమనేని ప్రభాకర్, ఏ-4గా దేవినేని ఉమాలు ఉన్నారు.