ఓఎన్జీసీ పైపులైన్ ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు వర్చువల్గా డబ్బు విడుదల చేశారు.. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్ము జమ చేశారు.
బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. ఇంకా కొన్ని చోట్ల చిరు జల్లులు పడుతున్నాయి.. ఇక, నెల్లూరు జిల్లాలోని పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి.. గూడూరు డివిజన్ లోని కోట.. వాకాడు.. చిల్లకూరు.. నాయుడుపేట డివిజన్లోని సూళ్లూరుపేట.. తడ ప్రాంతాల్లో అధిక వర్షం నమోదవుతోంది.. వర్షాలతో మెట్ట పంటలకు ప్రయోజనం కలుగుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. అయితే,…
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుకు హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషం విదితమే.. అయితే, చంద్రబాబుకు బెయిల్ మంజూరుపై ఏపీ ప్రభుత్వ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.. బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొన్న పలు అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వ వర్గాలు.. స్కిల్ స్కాంకు సంబంధించిన డబ్బు టీడీపీ పార్టీ ఖాతాలోకి చేరినట్టుగా కచ్చితమైన ఆధారం లేనట్టుగా బెయిల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇది తొందరపాటుగా భావిస్తున్నాం అంటున్నాయి.
రేపు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూళ్లూరుపేట, తిరుపతి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వాకాడు మండలం రాయదరువు దగ్గర ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కు శంఖుస్థాపన చేయనున్నారు.
టీడీపీ నుంచి వైసీపీ పార్టీలోకి భారీగా చేరికలు అవుతున్నాయి. పట్టణంలోని కొండారెడ్డి కాలనీ కౌసర్ మసీద్ ముత్తు వలితో పాటు ఆయన అనుచరులు సుమారు 35 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలోకి చేరిక వీరిని ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.