Parvathipuram: పాలకొండలో రెచ్చిపోయిన దొంగలు .. దిశా ఎస్సై ఇంట్లో చోరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సామాన్య ప్రజల ఇల్లలో దొంగతనం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. పాపం పోలీసులు కష్టపడి ఘటన స్థలానికి చేరుకోవాలి.. అదే పోలీసు ఇంట్లోనే దొంగతనం చేస్తే ఆ సమస్య ఉండదు. పోలీలీసులను ఇబ్బంది పెట్టినట్లు ఉండదు అనుకున్నాడేమో గాని ఏకంగా ఎస్సై ఇంట్లోనే చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటన పార్వతీపురం జిల్లాలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి పార్వతీపురం జిల్లా లోని పాలకొండ లోని దిశా ఎస్సై ఇంట్లో అలానే ఓ కానిస్టేబుల్ ఇంట్లోనూ దొంగలు పడ్డారు. ఈ నేపథ్యంలో ఎస్సై ఇంట్లో అందినకాడికి దోచుకున్నారు. అనంతరం కానిస్టేబుల్ ఇంట్లోనూ దొంగతనానికి యత్నించారు. అయితే కానిస్టేబుల్ ఇంట్లో ఏమి దొరకకపోయేసరికి నిరాశగా వెనుదిరిగారు.
Read also:Delhi: పెళ్లి ప్రపోజల్ రిజక్ట్ చేసిందని, సోషల్ మీడియాలో మహిళ ఫోటోలు
Also Read
- Arnab Cyclone Alert: దూసుకొస్తున్న అర్నబ్ తుఫాన్.. రెండు రోజులు విద్యాసంస్థలకు సెలవు..
- AP Mayor Elections 2026: 13 కార్పొరేషన్లలో 346 నామినేషన్ల ఉపసంహరణ.. చిత్తూరులోనే అత్యధికం!
- ZP Chairman Election: కోనసీమ కూటమిలో కొత్త ట్విస్ట్.. జనసేన అభ్యర్థిగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కుమార్తె!
- Arnab Cyclone Alert: పెనుగండంగా ‘అర్నాబ్’ తుఫాన్.. కుంభవృష్టి వర్షాలు.. ఆ జిల్లాలకు పెను ముప్పు!
కాగా దిశ పోలీసు స్టేషన్ ఎస్సై లావణ్య పాలకొండ డీఎస్పీ ఆఫీసుకు సమీపంలోనే నివాసం ఉంటున్నారు. అయితే ఆమె ఆ రాత్రి జిల్లా కేంద్రంలోనే ఉండిపోయారు. కాగా ఎస్సై తల్లి సైతం ఊరెళ్లారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరు లేకపోవడం చేత దొంగలు చేతివాటం చూపించారు. కాగా తెల్లవారాక ఇంటి తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన పొరుగింటి వారు ఎస్సైకి సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఎస్సై హుటాహుటీన ఇంటికి చేరుకొని చూడగా ఇంట్లో నుంచి రూ.30 వేలు క్యాష్, తులం బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. కాగా పాలకొండలో ఒకే రోజు మూడు ఇల్లలో దొంగతనాలు జరగగా వాటిలో రెండు ఇల్లు పోలీసులవి కావడమే గమనార్హం.
తాజావార్తలు
-
Srinidhi Shetty: గ్లామర్ పక్కనపెట్టి ‘అమ్మ’ పాత్రలో కేజీఎఫ్ బ్యూటీ.. కెరీర్ రిస్క్?
-
Jailer 2: రజినీ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. తెలుగులోనే రూ.100 కోట్లు!
-
CM Vijay : రూ.30 బియ్యంపై సీఎం విజయ్‌కు షాక్
-
Bank Holidays: రాబోయే 2 నెలల్లో 33 రోజులు బ్యాంకులు బంద్! ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు..
-
Srinidhi Shetty : రూట్ మార్చిన ‘ఆదర్శ కుటుంబం’.. త్రివిక్రమ్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్!
ట్రెండింగ్
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!
-
Char Dham Yatra Closing Dates: చార్ధామ్ వెళ్లే భక్తులకు అలెర్ట్.. ఆ తేదీ నుండే మూతపడనున్న ఆలయాల తలుపులు..!
-
ఇంట్లోనే హోమ్ థియేటర్.. TCL 65 అంగుళాల 4K Google TV పై రూ. 60,000 భారీ డిస్కౌంట్..!