Deputy CM Narayana Swamy: తిరుపతిపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.. తిరుపతిని వాటికన్ సిటీనీ చేశారంటూ ‘ఆడుదాం ఆంధ్రా’లో డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. తిరుపతి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి గురించి మాట్లాడిన నారాయణస్వామి.. అభియన్ రెడ్డికి సబ్జెక్ట్‌ను ఎలా నేర్చుకోవాలో తెలుసు.. మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.. తిరుపతి రూపురేఖలను మార్చేశారు.. అలాగే తిరుపతిని వాటికన్ సిటీగా మార్చారంటూ వ్యాఖ్యానించారు.. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
Read Also: Bharat Nyay Yatra: మణిపూర్ నుంచి ముంబై వరకు రాహుల్ ‘భారత్ న్యాయ యాత్ర’!
అయితే, తిరుపతి హిందువుల పవిత్ర పుణ్య క్షేత్రం.. అలాంటిది తిరుపతిని క్రైస్తవుల ప్రధాన పవిత్ర స్థలంతో.. ఎలా పోల్చుతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు భారతీయ జనతా పార్టీ నేత భాను ప్రకాష్ రెడ్డి.. హిందువుల మనోభావాలు దెబ్బతీనేలా మంత్రులు మాట్లాడుతూన్నారన్న ఆయన.. తిరుపతిని వాటికన్ సిటీతో పోల్చకండి.. లేదంటే తిరుపతి వదలి వాటికన్ సిటీకే వెళ్లండి అని సలహా ఇచ్చారు. అంతే కానీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మెప్పూకోసం అన్యమత ప్రచారం చేయకండి అంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామికి హితవుపలికారు బీజేపీ నేత భాను ప్రకాష్‌రెడ్డి. కాగా, ఇప్పటికే పలు సందర్భాల్లో వివిధ అంశాలపై హాట్ కామెంట్లు చేస్తూ వచ్చారు నారాయణస్వామి.. కొన్నిసార్లు ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని కూడా రేపడం.. ఆయన కామెంట్లపై విమపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు లేకపోలేదు.