తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. మార్పుల విషయంలో నాకు ఎటువంటి పిలుపు రాలేదు.. చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభం కాబట్టి రైతుల పేమెంట్లు చెల్లింపుల కోసమే సీఎంవోకు వచ్చాను అని ఆయన తెలిపారు. 12.5 కోట్ల రూపాయలను విడుదల చేయాలని సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.. వచ్చే ఎన్నికల్లో నాకు సీటు ఇవ్వడం లేదని.. మార్చుతున్నారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు అని కరణం ధర్మశ్రీ పేర్కొన్నారు.
Read Also: 2023 World Records : 2023లో అతి చిన్న చెక్క చెంచా నుండి పొడవాటి జుట్టు వరకు ప్రపంచ రికార్డులు ఇవే..
నా సీటులో ఎలాంటి మార్పు ఉండదని భావిస్తున్నాను అని చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సీఎం ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా చేస్తాను.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలను తప్పక పాటిస్తాను.. వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వకపోయినా నాకు అభ్యంతరం లేదు.. కొందరు నాయకులు స్వార్థపూరితంగా వ్యవహరిస్తూ అటు ఇటూ వెళ్తున్నారు అని ఆయన మండిపడ్డారు. మొదటి నుంచీ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్నా.. ఇక పైనా జగన్ తో పాటే ఉంటాను.. మంత్రి పదవి నా నసీబ్ లో రాసినట్లు లేదు.. అందుకే రాలేదు.. ఇన్ చార్జీల మార్పులు చేర్పులు ఎన్నికల కసరత్తులో భాగం మాత్రమేనంటూ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ వెల్లడించారు.