సీఎం వైఎస్ జగన్ ఇంకా నిర్ణయం తీసుకోనప్పుడు నేను ఎమ్మెల్యేను అవుతా.. ఎంపీని అవుతానని ఎలా చెబుతా..?ను అంటూ ఎదురు ప్రశ్నించారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్.. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ఆయన.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. సర్వే రిపోర్టుల ఆధారంగా సీఎం జగన్ టికెట్లు నిర్ణయిస్తారు.. అన్ని కులాలను గుర్తు పెట్టుకుని, అభ్యర్థి బలాలు బేరీజువేసుకుని టికెట్లు ఇస్తారని తెలిపారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కాకినాడ పర్యటన పొడిగించినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.. కాకినాడ సిటీ నియోజక వర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు జనసేనాని.. తన పర్యటనలో భాగంగా కాకినాడ సిటీపైనే ఎక్కువగా దృష్టి సారించారు. నియోజకవర్గాల సమీక్ష చేపట్టిన ఆయన కాకినాడ సిటీపైనే ఎక్కువ దృష్టి పెట్టారు..
Perni Nani Comments: ఇంకా ఎలక్షన్ షెడ్యూల్ రాకముందే ఏపీలో ఎన్నికల వాతావారం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల రానున్న నేపథ్యంలో అప్పుడే అధికార, ప్రతిపక్ష పార్టీ ప్రచారం మొదలు పెట్టాయి. ఈ క్రమంలో అధికార పార్టీ, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటుండందో ఏపీ రాజకియాలు వెడేక్కాయి. అధికార పార్టీ తాము చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళుండగా.. ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతుంది. Also Read: Yemmiganur: ఎమ్మిగనూరు వైసీపీలో కలకలం.. చెన్నకేశవ రెడ్డికి టికెట్…
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌పై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగుతోంది.. ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ కేషన్న, పలువురు సర్పంచులు, కొంతమంది ఎంపీటీసీలు సమావేశం అయ్యారు.. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డికే ఈసారి కూడా టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.. చెన్నకేశవరెడ్డికి టికెట్ ఇస్తే గెలిపిస్తాం.. వేరేవాళ్లకు టికెట్ ఇస్తే గెలిపించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు ఎమ్మిగనూరు ఎంపీపీ కేషన్న.
రెండో జాబితా ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 30 నియోజకవర్గాల్లో మార్పులు ఉండే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. అయితే, గత కొంతకాలంగా మంత్రి రోజా స్థానం మారుస్తారనే చర్చ సాగుతూ వచ్చింది.. ఓ దశలో రోజాకు అసలు సీటు డౌటే అనే ప్రచారం సాగింది.. కానీ, నగరిలో మంత్రి ఆర్కే రోజా స్థానం సేఫ్ అని తెలుస్తోంది.. అంతే కాదు.. మంత్రి అంబటి రాంబాబు నియోజకవర్గం కూడా నో ఛేంజ్ అంటున్నారు
మేం జనసేనతో పొత్తులో ఉన్నాం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అదే చెబుతున్నారని మరోసారి క్లారిటీ ఇచ్చారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. కానీ, తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయం కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందన్నారు.