నేడు మణిపూర్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
నేటి నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర.. మణిపూర్ నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర..
నేడు మణిపూర్ కు ఏపీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, రఘువీరారెడ్డి, పల్లంరాజు..
నేడు సీఎం క్యాంప్ ఆఫీసులో సంక్రాంతి సంబరాలు.. సంక్రాంతి వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్..
నేడు సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగిమంటల కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి అంబటి రాంబాబు.. భోగి వేడుకల్లో భాగంగా ప్రతి ఏటా స్పెషల్ అట్రాక్షన్ గా మారిన మంత్రి అంబటి డాన్స్ కార్యక్రమం..
నేడు ఎన్టీఆర్ స్టేడియంలో సంక్రాంతి సంబరాలు.. పాల్గొననున్న గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు, నగర మేయర్, ఇతర ఉన్నతాధికారులు..
నేడు నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తన స్వగ్రామమైన తోడేరులో జరిగే సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటారు..
నేడు కళ్యాణదుర్గం పట్టణ శివారు తోటలో ఆత్మీయ కలయిక పేరుతో సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి
శ్రీసత్యసాయి జిల్లా రొద్దం మండల పరిధిలోని పలు గ్రామాలలో పర్యటించనున్న మంత్రి ఉషశ్రీ చరణ్
నేడు నారావారిపల్లె సంక్రాంతి వేడుకలు.. ఉదయం 8:30 గంటలకు నారా భువనేశ్వరి భోగి మంటలు.. పలు జీవో కాపీలను దగ్దం చేయానున్న భువనేశ్వరి.. సాయంత్రం నారా వారిపల్లెకు చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ
నేడు నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ నేతలతో జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజిజ్ సమావేశం.. చంద్రబాబు వెంకటగిరి పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
నేటితో తిరుమలలో ముగియనున్న ధనుర్మాసం
నేడు విశాఖలోని ఆర్కే బీచ్ లో కైట్ ఫెస్టివల్.. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జరగనున్న పతంగుల పోటీ..
నేటి నుంచి ఇరాన్ లో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పర్యటన.. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై చర్చ.. ఎర్ర సముద్రంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భేటీకి ప్రాధాన్యత..
నేడు అంతర్జాతీయ కైట్ అంండ్ స్వీట్స్ ఫెస్టివల్.. కైట్స్ ఎగరవేయనున్న 16 దేశాల నుంచి 100 మంది ఆటగాళ్లు..
నేడు ఆఫ్ఘనిస్తాన్- భారత్ మధ్య రెండో టీ20.. రాత్రి 7గంటలకు ఇండోర్ వేదికగా మ్యాచ్..